Minister Sridhar Babu: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణాకు తీరని అన్యాయం
ABN , Publish Date - Feb 01 , 2025 | 07:40 PM
Minister Sridhar Babu: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేదని మండిపడ్డారు. తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుదని చెప్పారు. గిరిజన యూనివర్సిటీకి మద్దతు ఇవ్వలేదని మండిపడ్డారు. గోదావరి-మూసీ అనుసంధానం ప్రస్తావనే లేదని చెప్పారు.
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridarbabu) అన్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయని చెప్పారు. కేంద్ర జీడీపీలో రాష్ట్రం వాటా 5 శాతంగా ఉన్నా ఆ మేరకు నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి పన్నులు రూపంలో రూ.26 వేల కోట్లు కేంద్రానికి వెళ్లాయని గుర్తుచేశారు. గతంలో కంటే 12 శాతం పెరిగినా రాష్ట్రంపై చిన్నచూపు చూడటానికి రాజకీయ కారణాలే కారణమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందని విమర్శించారు. బీహార్, ఢిల్లీ, ఏపీ, గుజరాత్‌లకు మాత్రమే ఫ్రాధాన్యతనివ్వడం కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కలు పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సహా కేంద్ర మంత్రులను కలిసి రూ.1.63 వేల కోట్ల సహాయం కోసం అడిగారని తెలిపారు. మెట్రో-2 ప్రాజెక్టు 76.4 కిలోమీటర్ల విస్తరణకు కేంద్రం వాటాగా రూ.17.212 కోట్లు కేటాయించాలని కోరగా రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు.
ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, శివారు మున్సిపాలిటీలకు CSMP కింద భూగర్భ డ్రైనేజీకి నిధులు కేటాయించాలని విన్నవించుకున్నా అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ నది హైదరాబాద్‌లో 55 కి. మీ ప్రవహిస్తోందని చెప్పారు. మురుగు కూపంగా మారిన ఈ నది పునరుజ్జీవం కోసం రూ.4 వేల కోట్లు అడిగితే కేంద్రం నిరాశ పరిచిందని మండిపడ్డారు. బీజేపీ దృష్టిలో మాత్రం దేశమంటే ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాలు మాత్రమే అని చెప్పారు. సమాఖ్య స్ఫూర్తిని విస్మరిస్తూ.. ప్రతి బడ్జెట్‌లోనూ ఇదే ధోరణిని అవలంభిస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు.
ఈసారి బీహార్‌పై వరాల జల్లు కురిపించారన్నారు. పెద్దన్నలా అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన నైతిక బాధ్యతను విస్మరించి.. కొన్ని రాష్ట్రాలపైనే ప్రేమను చూపిస్తురని విమర్శించారు. తలసరి ఆదాయం, వృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ, నవోదయ, సైనిక్ స్కూల్స్‌ను కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని చెప్పారు. కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరినా రూపాయి ఇవ్వలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరినా విస్మరించారని చెప్పారు. పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఊసే లేదని అన్నారు. తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుదని చెప్పారు. గిరిజన యూనివర్సిటీకి మద్దతు ఇవ్వలేదని మండిపడ్డారు. గోదావరి-మూసీ అనుసంధానం ప్రస్తావనే లేదన్నారు. MGNREGA పథకం అమల్లో వెసులు ఇవ్వాలని కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Harish Rao on Union Budget: దేశమంటే కొన్ని రాష్ట్రాలేనా.. బడ్జెట్‌పై హరీష్ విమర్శలు
Etela Rajender : కాంగ్రెస్ నేతలు పరువు తీసుకున్నారు.. ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్
Congress MLA's: కాంగ్రెస్ నేతల రహస్య సమావేశం.. వాళ్లే టార్గెట్‌గా..
Revanth Reddy: మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం.. కారణమిదే..
Read Latest Telangna News And Telugu News