TG GOVT: విద్యా వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Feb 03 , 2025 | 10:25 AM
Minister Ponnam Prabhakar: తెలంగాణ విద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను బాలకార్మికులుగా చేర్చే ప్రయత్నం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

సిద్దిపేట జిల్లా: తెలంగాణలో విద్యా వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయంయ తీసుకుంది. ప్రభుత్వ పక్షాన విద్యవ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరికీ విద్యా అందటానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదర్శ ఇందిరమ్మ పాఠశాలలు, నూతన నియామకాలు మౌలిక సదుపాయాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. వసంత పంచమినీ పురస్కరించుకొని ఇవాళ(సోమవారం) వర్గల్ మండల కేంద్రంలోనీ శ్రీ విద్య సరస్వతి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...
తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత విద్యావంతుడై తెలంగాణ అభివృద్ధితో పాటుగా దేశంలో కూడా అన్ని రంగాల్లో ముందు ఉండాలని అమ్మవారి కటాక్షం ఉండాలని కోరుకున్నానని చెప్పారు. తల్లిదండ్రులు మీరు ఒక పూట శ్రమపడ్డ పిల్లలను చదివించడానికి శ్రద్ధ వహించాలని అన్నారు. ఏ ఆస్తి ఆన్న ఎప్పుడైనా పోవచ్చు కాని విద్యాకు సంభందించిన ఆస్తి ఎప్పుడు పోదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో అటు బాసర ఇటు వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయాలు మన ప్రాంతంలో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం తరఫున దేవాలయాల అభివృద్ధికి కానీ దేవాలయాలకు సంబంధించిన విద్యాలయాలకు అభివృద్ధికి సంభందించిన విషయంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను బాలకార్మికులుగా చేర్చే ప్రయత్నం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
వివరాలు ఇవ్వలేదు..
ప్రధాన రాజకీయ పార్టీ పెద్దలు కులగణనలో వివరాలు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎమ్మెల్సీ కవిత తప్పా ఎవరూ వివరాలు ఇవ్వలేదని చెప్పారు. సర్వే కోసం వెళ్లిన వాళ్లపైకి కుక్కలను వదిలిన వారూ ఉన్నారని అన్నారు. సహాయ నిరాకరణ లాగా కొందరు కావాలని వివరాలు ఇవ్వలేదని చెప్పారు. కులగణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియజేయాలని చెప్పారు. గాంధీ భవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. బలహీన వర్గాల కోసం రేపు అసెంబ్లీలో అన్ని పార్టీలు తమ వాదన వినిపించాలని అన్నారు.
కులగణన అడ్డుకుంటే ఊరుకునేది లేదు..
కులగణన ఒక ఉద్యమం లాగా చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఎవరు ఎంత అనే లెక్క తేలిందన్నారు. క్యాబినెట్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కులగణన చేస్తామని మాట ఇచ్చాం. చేసి చూపించామన్నారు. కులగణన అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కులగణన కోసం పోరాటం చేసిన వారందరిని ప్రశంసించారు. ప్రభుత్వం నిర్ణయం నుంచి నివేదిక దాకా కులగణన ప్రక్రియలో భాగం అయినందుకు గర్వంగా ఉందన్నారు. బీసీ సోదరులందరూ రేపు ఉత్సవాలు జరపాలని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రేపు అసెంబ్లీకు రావాలని కోరారు. బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Fire Accident: బాలానగర్‌లో అగ్ని ప్రమాదం..
Vasant Panchami.. బాసరలో కిటకిట లాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు
Read Latest Telangana News and Telugu News