Share News

Minister Joopally On Kavitha: కవితపై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Sep 06 , 2025 | 03:57 PM

కవిత మాజీ సీఎం కేసీఆర్(KCR) చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు(Joopalli Krishnarao) గుర్తు చేశారు. కవిత కూడా కొరివి దెయ్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Minister Joopally On Kavitha: కవితపై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు..

జోగులాంబ గద్వాల: జిల్లా కేంద్రంలో 2-BHK ఇళ్ల గృహ ప్రవేశం కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో.. మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ ఎమ్మెల్సీ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు.


కవిత మాజీ సీఎం కేసీఆర్(KCR) చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు(Joopalli Krishnarao) గుర్తు చేశారు. కవిత కూడా కొరివి దెయ్యమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని కవితనే చెప్పారని తెలిపారు. తాను ఆనాడు మంత్రి పదవి కోసం బీఆర్ఎస్(BRS) పార్టీలోకి రాలేదని పేర్కొన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాతర వేసిందని విమర్శించారు. కవిత కొంత దాచిపెట్టి.. కొంత మూసిపెట్టి మాట్లాడుతున్నారని జూపల్లి ఆరోపించారు.


ఇవి కూడా చదవండి..

సీఎం కారుకు జరిమానా.. డిస్కౌంట్‌తో చెల్లింపు

ఆపరేషన్ సిందూర్ ముగియలేదు... ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 06 , 2025 | 03:59 PM