Betting Apps Promotion Case: సీఐడీ ముందుకు మళ్లీ మంచు లక్ష్మీ
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:47 PM
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని ఈడీ, సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో విచారణ కోసం మరోసారి మంచు లక్ష్మీని సీఐడీ అధికారులు ముందు మంగళవారం హాజరయ్యారు.
హైదరాబాద్, డిసెంబర్ 23: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సీఐడీ ముందు మంచు లక్ష్మీ మరోసారి హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో సీఐడీ అధికారుల ఎదుట ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే వ్యవహారంలో ఇప్పటికే ఈడీ అధికారుల ఎదుట ఆమె హాజరయ్యారు. అలాగే ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, రానా, విజయ్ దేవరకొండ సైతం ఈడీ అధికారుల ముందు హాజరైన సంగతి తెలిసిందే.
ఇక ఇదే కేసులో హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, నటి అమృత చౌదరి కూడా సీఐడీ అధికారుల విచారణకు గతంలో హాజరై వివరణ ఇచ్చిన విషయం విదితమే. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం జరిగిన లావాదేవీలపై గతంలోనే వీరిని అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో బెట్టింగ్ యాప్స్‌కు ఎందుకు ప్రమోట్ చేశారు?. అందుకు ఎంతెంత తీసుకున్నారు?. యాప్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలపై వీరి నుంచి అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మైగ్రేన్ తగ్గించే దివ్యౌషధం.. సింపుల్ చిట్కా.. చిన్న ముక్క ఇదిగో..
అసెంబ్లీ ఎన్నికలు.. సత్తా చాటిన బీజేపీ
For More TG News And Telugu News