Mahesh Goud Reacton On KCR Comments: కవిత గురించి కేసీఆర్ ఏం వివరణ ఇస్తారో చూద్దాం: పీసీసీ చీఫ్
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:00 PM
తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకి తెచ్చింది ఏమైనా ఉందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 21: కేసీఆర్, హరీష్ రావు చేసిన తప్పిదాల వల్లే తెలంగాణ రాష్ట్రంలో నదీజలాల సమస్యలు ఉత్పన్నమైనాయని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శించారు. వృథా ప్రాజెక్టుల కోసం కేసీఆర్ అనవసరపు ఖర్చు చేశారని ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ఎల్‌పీ సమావేశంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమేనన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత గురించి కేసీఆర్ ఏం వివరణ ఇస్తారో చూద్దామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో గతంలో చేసిన అప్పులపై కేసీఆర్ ఏం సంజాయిషీ ఇస్తారో వేచి చూద్దామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో తాము 70 శాతం గెలిచామని పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ ఎక్కడుంది? అంటూ ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకి తెచ్చింది ఏమైనా ఉందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మీ12 ఏళ్ల పాలనపై.. తెలంగాణలో తమ రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు.
రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి మోకాలు అడ్డు పెడుతున్నారంటూ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారని విమర్శించారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీల్లో మెజార్టీ అంశాలను ఇప్పటికే తాము నెరవేర్చామని ఆయన స్పష్టం చేశారు.
ఇంతకీ కేసీఆర్ ఏమన్నారంటే.. ?
ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్రకార్యవర్గ సమావేశం జరిగింది. దీనిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు.. తనను దూషించడమే రాష్ట్ర ప్రభుత్వ విధానమని విమర్శించారు.
పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరిగితే బీఆర్ఎస్ సత్తా ఏమిటో తెలిసేదన్నారు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్పారని అభిప్రాయపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అహంకార వైఖరి ప్రదర్శించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. రెండేళ్లు అవుతున్నా.. ఒక్క కొత్త పాలసీ తీసుకురాలేదని విమర్శించారు. తెచ్చిన పాలసీ కూడా రియల్ ఎస్టేట్ కోసమేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు వచ్చేదన్నారు కానీ ప్రస్తుతం యూరియా కోసం కుటుంబమంతా లైన్‌లో నిలబడే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైవిధంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వంటబట్టని నూనెలు.. పెరుగుతున్న వంటనూనెల ధరలు
పెళ్లిలో కళకళలాడాలంటే.. ఎటువంటి ఆహారం తీసుకోవాలి
For More TG News And Telugu News