KTR Warns Congress: కాంగ్రెస్‌కు ఓటేస్తే.. హైడ్రా బుల్డోజర్ రావడం ఖాయం: కేటీఆర్
ABN , Publish Date - Oct 13 , 2025 | 02:14 PM
కాంగ్రెస్‌ను హైదరాబాదీలు నమ్మలేదని.. హైదరాబాద్ ఎన్నికల్లో అందుకే ఒక్క సీటూ ఇవ్వలేదని కేటీఆర్ తెలిపారు. ఇళ్లు కూలగొట్టడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రశ్నించారు.
హైదరాబాద్, అక్టోబర్ 13: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కారు, బుల్డోజర్‌కు మధ్య జరగుతున్న ఎన్నికని అన్నారు. ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే హైడ్రా బుల్డోజర్ ఇంటికి రావటం ఖాయమంటూ వ్యాఖ్యలు చేశారు. మోసపోతే.. ప్రజలు ఘోస పడతారన్నారు. మాగంటి గోపినాథ్ కుటుంబం అనాధ కాదని.. వారికి అందరం అండగా ఉంటామని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉందన్నారు. తెలుగు భాషలో ఎన్ని తిట్లు ఉన్నాయో.. రేవంత్ రెడ్డిని ప్రజలు అన్ని తిట్లు తిడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
ఒక్కొక్కరికి కాంగ్రెస్ ఎంత బాకీ పడిందో గుర్తించి.. ప్రతి వ్యక్తిని కలిసి బాకీ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ను హైదరాబాదీలు నమ్మలేదని.. హైదరాబాద్ ఎన్నికల్లో అందుకే ఒక్క సీటూ ఇవ్వలేదని తెలిపారు. ఇళ్లు కూలగొట్టడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాదిరి గలీజ్ భాష మాట్లాడే ముఖ్యమంత్రి దేశంలోనే లేరని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
సునీతకు అండగా ఉంటాం: హరీష్ రావు
‘సోదరి మాగంటి సునీతకు కేటీఆర్, నేను.. కుడి ఎడమల మాదిరిగా ఉంటాం’ అని హామీ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికన్నారు. తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజల వైపు చూస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడినంత మాత్రానా.. రేవంత్ రెడ్డి పదవి పోదన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని మాట తప్పారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్‌లో చురుకు తగలాలన్నారు. బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని.. మెజారిటీ కోసమే ఎన్నికని చెప్పారు. హైడ్రా ఆగాలంటే.. బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు. రేవంత్ .. తెలంగాణను అత్యంత అవినీతిమయంగా మర్చారని ఆరోపించారు. తెలంగాణను కేసీఆర్ దేశానికి ఆదర్శంగా తయారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి ఏవిధంగా ఉండకూడదు అంటే.. రేవంత్ రెడ్డి మాదిరి ఉండకూడదంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు.
మాగంటి సునీత భావోద్వేగం...
కాగా.. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత భావోద్వేగానికి గురయ్యారు. భర్త దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ను తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. గోపినాథ్ ఆశాయాలు ముందుకు తీసుకెళ్తానని మాగంటి సునీత స్పష్టం చేశారు. అలాగే గోపీనాథ్ కుమార్తె అక్షర మాట్లాడుతూ.. ‘మా తండ్రి గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకెళతాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాం’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతులతో కలిసి సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన సీఎం
జువైనల్ హోంలో లైంగిక దాడిపై పోలీసులు ఏం తేల్చారంటే
Read Latest Telangana News And Telugu News