Share News

KTR: రేవంత్ రెడ్డి వల్లే రూ.15 వేల కోట్ల లాస్ : కేటీఆర్

ABN , Publish Date - Sep 28 , 2025 | 10:12 AM

రేవంత్ రెడ్డి అహంభావం వల్ల మెట్రో రైల్ రూపంలో తెలంగాణకు రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని కేటీఆర్ అన్నారు. అయితే, అదృష్టవశాత్తూ ఎల్ అండ్ టీ తెలంగాణ ప్రజల్లాగా చేతకాని ముఖ్యమంత్రిని భరించాల్సిన అవసరం లేకపోయిందని..

KTR:  రేవంత్ రెడ్డి వల్లే రూ.15 వేల కోట్ల లాస్ : కేటీఆర్
KTR slams CM Revanth reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంభావం వల్లే తెలంగాణకు రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి చేతకాని తనం, అహంభావం కారణంగా రాష్ట్రాభివృద్ధి గాడి తప్పిందని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో రైల్ ను 'ఎల్ అండ్ టి' సంస్థ కోసం తీసుకుంటామన్న రేవంత్ ప్రభుత్వ నిర్ణయం వలన రూ. 15,000 కోట్ల భారం ప్రజలపై పడిందని చెప్పుకొచ్చారు.


రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ అవసరాల కోసం, ఉనికిలో లేని ఫోర్త్ సిటీ (Fourth City) వైపు మళ్లించే నెపంతో, ఏకపక్షంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్‌ను రద్దు చేశారని కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డ వద్ద అక్రమ కేసులు పెడతామని ఎల్&టీ వంటి భారీ కార్పొరేట్ సంస్థను బెదిరించారని కేటీఆర్ ఆరోపించారు. ఇది కేవలం తన రాజకీయ ప్రయోజనాలు, కమీషన్ల కోసమేనని కేటీఆర్ అన్నారు.


'నేషనల్ టెలివిజన్‌ లోనే స్వయంగా ఎల్&టీ కంపెనీ సీఎఫ్‌ఓను జైల్లో పెట్టాల్సిందిగా పోలీసులను కోరానని గొప్పలు చెప్పుకున్నారు.. ఎల్&టీ ప్రతిష్టను దిగజార్చి, సంస్థను నాశనం చేయడానికి ప్రయత్నించారు. అయితే, అదృష్టవశాత్తూ ఎల్&టీ తెలంగాణ ప్రజల్లాగా చేతకాని ముఖ్యమంత్రిని భరించాల్సిన అవసరం లేకపోయింది. అందుకే వారు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోతున్నారు.

సీఎం మితిమీరిన అహంభావం, గూండాగిరి కారణంగా రాష్ట్ర పన్ను చెల్లింపుదారులపై రూ. 15,000 కోట్ల అప్పు భారం పడనుంది. ప్రభుత్వ చేతకానితనం వల్లే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిచిపోయింది. ఆరోగ్యశ్రీ పథకం స్తంభించింది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కినాయి. కానీ కార్పొరేట్ కంపెనీ రుణాన్ని భరించేందుకు మాత్రం రేవంత్ రెడ్డికి నిధులు ఉన్నాయి'. అని కేటీఆర్ రేవంత్ సర్కారుపై తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం 'ఎక్స్' ఖాతాలో కేటీఆర్ విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి..

చొరబాట్లకు సిద్ధంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు.. బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి

ఇక్కడున్నది ఎవరో మౌలానా మర్చిపోయినట్టున్నారు... యోగి స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2025 | 10:25 AM