Khammam Scam: భూభారతి పేరుతో.. నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు..
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:45 AM
భూ భారతిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ ఓ ముఠా రైతులను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు ఇచ్చి పట్టాదారు పుస్తకం కోసం వెళ్లగా.. నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఇచ్చేవారని పేర్కొన్నారు.
ఖమ్మం: ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా.. వివిధ రకాల మోసాలు, నేరాలకు పాల్పడుతున్నారు. వారి స్వలాభం కోసం లేనోడి పొట్టను కొడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తామని ఓ ముఠా రైతుల నుంచి డబ్బులు దండుకుంది. రైతుల ఫిర్యాదు మేరకు ముఠా గుట్టురట్టు చేసి ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. భూ భారతిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ ఓ ముఠా రైతులను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు ఇచ్చి పట్టాదారు పుస్తకం కోసం వెళ్లగా.. నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ఇచ్చేవారని పేర్కొన్నారు. బయ్యారంలో కలర్ జిరాక్స్ మిషిన్లను పాల్వంచలో ప్రింటింగ్ మిషన్లను ఏర్పాటు చేసుకుని నకిలీ పాస్ పుస్తకాలతో దందా చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు.
కొందరు రైతులకు పాస్ పుస్తకం ఇవ్వడం ఆలస్యం కావడంతో.. అనుమానం వచ్చిన రైతులు కూసుమంచి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ మేరకు తనిఖీలు చేపట్టి ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఖమ్మం జిల్లాతో పాటు ఆరు జిల్లాలలో ఈ ముఠా మోసాలు చేసినట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు నకిలీ పాస్ పుస్తకాల దందాపై లోతుగా విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు