Share News

KCR: అసెంబ్లీ సమావేశాలు.. సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం

ABN , Publish Date - Mar 11 , 2025 | 07:22 PM

KCR: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో వారితో సమావేశమై.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నలు సంధించాలని సూచించారు.

KCR: అసెంబ్లీ సమావేశాలు.. సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం
BRS Chief KCR

హైదరాబాద్, మార్చి 11: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి అంటే మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభమవుతోన్నాయి. ఈ నేపథ్యంలో సభలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమైంది. అందులోభాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సమావేశమైయ్యారు. హామీల అమల్లో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వారికి దిశానిర్దేశం చేశారు.

అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, సృష్టించిన ఆస్తుల గురించి ఈ సందర్భంగా వారికి కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. 4 లక్షల కోట్లు అప్పు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన జస్ట్ 14 నెలల్లోనే రూ. లక్ష 50 వేల కోట్లు అప్పులు చేసిందని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అప్పుల విషయంలో బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు.


అయితే కాంగ్రెస్ పార్టీ ఇంత భారీగా అప్పులు చేస్తున్నా.. ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలు మాత్రం అమలు కావడం లేదని వారికి మాజీ సీఎం కేసీఆర్ వివరించారు. రైతు బంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిని మార్చి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆ క్రమంలో తొలి రోజు ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఇక మార్చి 13వ తేదీ గురువారం సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. శాసన మండలి సమావేశాలు సైతం బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.


మరోవైపు అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదు. దీంతో అధికార పక్షంలోని పలువురు నేతలు.. కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై విమర్శలతో పాటు వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


2023 ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కింది. అయితే కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనంతరం ఆయన అటు వైపు చూడలేదు. పైగా ఆయన ఉమ్మడి మెదక్ జిల్లా చింతమడకలోని ఫామ్ హౌస్‌కి పరిమితమయ్యారు.


ఇంకోవైపు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో మీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని ఆరోపణలు, విమర్శలకు జవాబు ఇస్తామంటూ సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి సైతం కాస్తా ఘాటుగా జవాబు ఇచ్చారు. అలాంటి వేళ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 12 నుంచి ప్రారంభమవుతోన్నాయి. మరి సభకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరైతే.. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగే అవకాశముందని ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: పోసానికి బెయిల్ మంజూరు

Also Read: చింతకాయల వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ

Also Read: నా చేతిలో కత్తి పెట్టి..

Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Mar 11 , 2025 | 07:22 PM