Share News

Shivam Verma: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:24 PM

Shivam Verma: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. తన స్నేహితురాలు అందంగా ఉన్నానని భావిస్తుందని భావించాడు. అంతేకాదు.. తనతో నమ్మకంగా ఉండడం లేదనుకున్నాడు. ఆ క్రమంలో ఆమెను తన ఇంటికి తీసుకు వెళ్లాడు.

Shivam Verma: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..
police van

లక్నో, మార్చి 11: తన స్నేహితురాలు అందంగా ఉన్నానని గర్వంగా భావిస్తుందని.. అలాగే తనతో నమ్మకంగా స్నేహం చేయడం లేదంటూ 17 ఏళ్ల యువతిని శివం వర్మ అనే యువకుడు గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. అనంతరం మృతురాలి స్నేహితురాలకి హంతకుడు ఫోన్ చేసి.. అందంగా ఉన్నానని మీ స్నేహితురాలు గర్వంగా ఫీలవుతుందంటూ ఫోన్ కట్ చేశాడు. ఈ నేపథ్యంలో జరిగిన విషయాన్ని మృతురాలి తండ్రికి ఆమె తెలియజేసింది. ఆయన హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.

అప్పటికే యువతి రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉంది. ఆ వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆమె తరఫు బంధువులు ఆందోళనకు దిగారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేస్తామంటూ వారికి నచ్చ చెప్పడంతో.. దాదాపు రెండు గంటల అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read: నా చేతిలో కత్తి పెట్టి..


ఈ హత్యపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు హంతకుడు శివం వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక తమ విచారణలో శివం వర్మ చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.మరోవైపు నిందితుడు తమ ఇంటి వద్ద అద్దెకు ఉండేవారని మృతురాలి తండ్రి పోలీసులకు వెల్లడించారు. అతని ప్రవర్తన సరిగ్గా ఉండేది కాదని వివరించారు. ఈ కేసులో తన కుమార్తెకు న్యాయం చేయాలని మృతురాలి తండ్రి పోలీసులకు విజ్జప్తి చేశారు.

For National News And Telugu News

Updated Date - Mar 11 , 2025 | 04:36 PM