Share News

CM Chandrababu: నా చేతిలో కత్తి పెట్టి..

ABN , Publish Date - Mar 11 , 2025 | 03:32 PM

CM Chandrababu: అంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణ కోసం శక్తి యాప్‌ను ప్రారంభించామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే రాష్ట్రంలో భూ కబ్జాలు, భూ వివాదాలు అధికంగా ఉన్నాయని చెప్పారు.

CM Chandrababu: నా చేతిలో కత్తి పెట్టి..

అమరావతి, మార్చి 11: ఆడ బిడ్డలపై అత్యాచారం చేసిన వారు ఇకపై తప్పించుకోలేరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో మత విద్వేషాలు లేని వాతావరణం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ముఠాల కుమ్ములాటలు..ఇక చెల్లవని..రాష్ట్రంలో రౌడీలు ఉండడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. రౌడీయిజం చేసి తప్పించుకుంటామంటే కుదరదన్నారు. భూ వివాదాలతోపాటు భూ కబ్జాలు భయంకరంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే భూ కబ్జాలపై ప్రత్యేక చట్టలున్నాయని.. అవి గుజరాత్‌ అమలు చేస్తోందన్నారు. భూ కబ్జాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా పకడ్బందీ చట్టాలు తీసుకు వస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

వైఎస్ వివేకాది హత్య అని అలా బయటపడింది..

మంగళవారం సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. తాను సైతం ఎన్నికల హడావుడిలో ఉండి వైఎస్ వివేకా హత్యపై అర్థం కానీ పరిస్థితి నెలకుందని వివరించారు. హోమ్ మంత్రి, ఉన్నతాధికారులు, డిజిపి ఇంతమంది ఉండి కూడా వైఎస్ వివేకా హత్య అర్ధం కాలేదన్నారు. తామంతా తొలుత గుండెపోటు అనుకున్నామని చెప్పారు. వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత పోస్ట్ మార్టం నిర్వహించాలన్నారు. కాబట్టి అసలు విషయం తెలిసిందని చెప్పారు. నా చేతిలో కత్తి ఫొటో పెట్టి.. నారా సుర రక్త చరిత్ర అని రాయించారన్నారు. తన రాజకీయ జీవితంలో హత్య రాజకీయాలు లేవని ఆయన కుండబద్దలు కొట్టించారు.


గతంలో దిక్కుమాలిన దిశా యాప్..

శక్తియాప్‌ను ప్రారంభించామన్నారు. ఆడబిడ్డలు శక్తియాప్ ఆన్ చేసి.. మూడు సార్లు షేక్ చేస్తే రిజిష్టర్ అవుతుందని తెలిపారు. ఆ వెంటనే 6 నుంచి 9 నిముషాల్లో మీ వద్దకు పోలీసులు వచ్చి రక్షిస్తారన్నారు. పోలీసులు అప్రతత్తంగా ఉండాలని.. లేకుంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో దిశా యాప్ అన్నారు.. దిక్కుమాలిన యాప్‌గా తయారైందని చెప్పారు. కానీ శక్తి యాప్ 100 శాతం పనిచేసే యాప్ అని ఆయన పేర్కొన్నారు. ఈ శక్తి యాప్ ద్వారా సహాయం కోరితే.. పోలీసులు అప్రోచ్ కావడమే కాకుండా.. యాక్షన్ సైతం తీసుకుంటారని స్పష్టం చేశారు.


మహిళలకు సీఎం కీలక సూచన..

ప్రజల్లో చైతన్యం లేకుంటే చట్టాలకు విలువ ఉండదని స్పష్టం చేశారు. ప్రతి మహిళ శక్తి యాప్ ను రక్షణగా వాడుకోవాలని సూచించారు. మహిళల్లో చైతన్యం తెచ్చే బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. శక్తి యాప్ అత్యంత శక్తివంతంగా రూపోందించామన్నారు. పోలీసులు నిర్లక్ష్యం వహించినా వారి ఫెయిల్యూర్ సైతం రికార్డు అవుతుందని చెప్పారు. ఇలాంటి ఉదంతాలు వెలుగు చూస్తే పోలీసులపైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శక్తి యాప్‌ను వినియోగించుకోవాలని రాష్ట్రంలోని ప్రతీ మహిళనూ కోరుతున్నామన్నారు. శక్తి యాప్‌కు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఈ సందర్భంగా టీడీపీ క్యాడర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.


ప్రశ్నిస్తే.. దాడులు చేశారు..

రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతో కీలకమన్నారు. గత వైసీపీ ప్రభుత్వహయాంలో గంజాయి.. డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయించారని విమర్శించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో అధికార వైసీపీని ప్రశ్నిస్తే.. పవిత్ర ఆలయాలుగా భావించే టీడీపీ కార్యాలయలపై దాడులు చేశారని వివరించారు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపామని స్పష్టం చేశారు.


ఈగల్ టీమ్‌లు రంగంలోకి..

రాష్ట్రంలో ఒక్క ఎకరాలో కూడా గంజాయి పడకుండా చూడాలని పేర్కొన్నారు. టెక్నాలజీ ద్వారా గంజాయి డ్రగ్స్ అరికడతామన్నారు. అందుకోసం ఇప్పటికే ఈగల్ టీమ్‌నూ ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని వివరించారు. అయితే గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలతోపాటు రౌడియిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించని స్పష్టం చేశారు. తమ పిల్లలపై.. ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 11 , 2025 | 04:21 PM