Share News

Kavitha Slams Congress: విద్యార్థుల గోస పట్టడం లేదు.. సర్కార్‌పై కవిత ఫైర్

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:01 PM

పరీక్ష రాసిన విద్యార్థులు.. ఉద్యోగాలు వచ్చిన విద్యార్థులు రాసిన పేపర్లు బయట పెట్టమని అడుగుతున్నారని కవిత అన్నారు. 50 వేల పాత ఉద్యోగాలు ఇచ్చి తాము ఇచ్చినం అని అంటున్నారని విమర్శించారు.

Kavitha Slams Congress: విద్యార్థుల గోస పట్టడం లేదు.. సర్కార్‌పై కవిత ఫైర్
Kavitha Slams Congress

హైదరాబాద్, అక్టోబర్ 8: గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) ఈరోజు (బుధవారం) నిరసనకు దిగారు. నిరుద్యోగులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. విద్యార్థుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో కొంత మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి గ్రూప్ 1 పెట్టారా అని ప్రశ్నించారు. తెలిసో తెలియకనో గత పదేళ్లలో గ్రూప్ 1 పెట్టలేదన్నారు. నిరుద్యోగులతో అధికారంలోకి వచ్చి వాళ్ళనే రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు.


పరీక్ష రాసిన విద్యార్థులు.. ఉద్యోగాలు వచ్చిన విద్యార్థులు రాసిన పేపర్లు బయట పెట్టమని అడుగుతున్నారన్నారు. 50 వేల పాత ఉద్యోగాలు ఇచ్చి తాము ఇచ్చినం అని అంటున్నారని విమర్శించారు. ప్రొఫెసర్ హరగోపాల్‌ను స్వయంగా కలుస్తామని.... వ్యవస్థ ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులలో నిరుద్యోగులను మోసం చేస్తే కుర్చీలో నుంచి తీసి బయట పడేస్తారని హెచ్చరించారు. రేపు ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ మీటింగ్ ఉందన్నారు. ప్రజా ఆగ్రహానికి గురికావొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఉద్యోగాలు వచ్చిన వారిపై తమకు కోపం లేదని.. అక్రమంగా తెచ్చుకున్న వారిపైనే కోపమని కవిత స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

అడ్లూరి నాకు సోదరుడు.. కలిసే ముందుకెళ్తాం: పొన్నం

సహచర మంత్రులు బాధ్యతాయుతంగా మాట్లాడండి: పీసీసీ చీఫ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 01:01 PM