Kavitha: ఎమ్మెల్యే మాధవరం వ్యాఖ్యలపై కవిత రియాక్షన్
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:28 PM
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలపై కవిత స్పందించారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణలకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్‌మీట్ పెడతానని వెల్లడించారు.
హైదరాబాద్, డిసెంబర్ 10: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Kukatpally MLA Madhavaram Krishna Rao) తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఆయన ఫస్ట్రేషన్‌ను బయట పెడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆయన చేసిన అన్ని ఆరోపణలకు ఆధారాలతో సహా వివరణ ఇస్తానన్నారు. కూకట్‌పల్లిలో 15 ఏళ్లుగా ఉన్న సమస్యలనే తాను చెప్పానని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడిన మాటాలకు ఫీలయ్యేది లేదని... ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.
జాగృతి జనం బాటలో భాగంగా ఐదు రోజుల పాటు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తామని తెలిపారు. నేడు కంటోన్మెంట్‌లోని బోయినపల్లి గవర్నమెంట్ స్కూల్‌ను సందర్శించినట్లు చెప్పారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్‌ను బాగు చేశారని.. కానీ కాంపౌండ్ వాల్, సీసీ కెమెరాలు లేవన్నారు. వాటిని తాము ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ స్కూళ్లోనే అంగన్ వాడీని కూడా కలిపారని... కానీ అంగన్‌వాడీలో హెల్పర్లు లేరన్నారు. జనం బాటలో భాగంగా విద్య, వైద్యం మీద ఫోకస్ పెట్టామని వెల్లడించారు. స్కూల్స్, హాస్పిటల్స్‌లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తున్నామన్నారు. ఇండ్లు, ఇళ్ల పట్టాలను లేని వారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నామన్నారు. తమ వరకు చేయగలిగేది ఒక సంస్థగా చేస్తామని స్పష్టం చేశారు. టాప్ టెన్ విద్యార్థులకు జాగృతి తరఫున స్కాలర్ షిప్‌లు ఇస్తామని ప్రకటించారు.
ఏ జిల్లాకు వెళ్లినా ప్రజల నుంచి ఆదరణ, సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటోందన్నారు. ప్రజల సమస్యలను వీలైనంతగా పరిష్కరిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో తనను నిజామాబాద్‌కే పరిమితం చేశారని.. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదన్నారు. తెలంగాణ వచ్చాక ఏం జరిగింది... ఏం జరగలేదన్నది జనం బాట కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తాము చేయగలిగేవి చేస్తామని... మిగిలిన సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. మంచిని మంచి, చెడును చెడు అనే అంటామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతిపక్షం పట్టించుకోవటం లేదని... పాలక పక్షం అసలే పట్టించుకుంట లేదని.. అందుకే జాగృతి జనం గళమై పనిచేస్తోందని కవిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఓటర్ల మద్దతు కోసం దేనికైనా సిద్ధమంటున్న అభ్యర్థులు
గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్.. హరీష్ సంచలన కామెంట్స్
Read Latest Telangana News And Telugu News