Hyderabad IT Raids: గోల్డ్ హోల్సేల్ సంస్థలపై ఐటీ రైడ్స్
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:14 PM
Hyderabad IT Raids: హైదరాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్ కంపెనీపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్ కళాసిగూడలో క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 17: నగరంలో ఐటీ సోదాలు (IT Raids) కలకలం రేపుతున్నాయి. ఈరోజు (బుధవారం) ఉదయం హైదరాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్ కంపెనీపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్ కళాసిగూడలో క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి క్యాప్స్ గోల్డ్ కంపెనీ పెద్ద ఎత్తున గోల్డ్‌ను కొనుగోలు చేస్తోంది. బంగారం కొనుగోలు చేసి ఆపై రిటైల్ గోల్డ్ షాప్స్‌కు ఈ కంపెనీ అమ్ముతోంది. ఈ క్రమంలో క్యాప్స్ గోల్డ్ కంపెనీకి హోల్సేల్‌గా ఉన్న సంస్థలపై కూడా ఐటీ సోదాలు జరుపుతోంది.
బంజారాహిల్స్‌లో కూడా క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయం ఉండటంతో అక్కడ కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో క్యాప్స్ గోల్డ్ కంపెనీ పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల్లో అవకతవకులు పాల్పడ్డట్టు ఐటీ గుర్తించింది. క్యాప్స్ గోల్డ్ చైర్మన్ చంద్ర పరమేశ్వర్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. సుమారు 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తోంది ఐటీ.
మరోవైపు వాసవి రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వాసవి సంస్థ.. క్యాప్స్ గోల్డ్‌కు అనుబంధంగా ఉన్నట్లు ఐటీ గుర్తించింది. ఈ క్రమంలోనే సోదాలు జరుగుతున్నాయి. వాసవి సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్, సౌమ్య కంపెనీలపై కూడా రైడ్స్ నిర్వహించింది ఐటీ సిబ్బంది. క్యాప్స్ గోల్డ్‌లో కూడా అభిషేక్ ,సౌమ్య డైరెక్టర్‌గా ఉన్నారు. వాసవికి సంబంధించిన 40 కంపెనీలకు సంబంధించిన దానిపై ఆరా తీస్తున్నారు. వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్ పైన ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ విమోచన వేడుకల్లో రక్షణమంత్రి... జెండా ఆవిష్కరణ
హైదరాబాద్‌లో మాన్సూన్ సర్వీసులకు బ్రేక్.. ఏం జరిగిందంటే
Read Latest Telangana News And Telugu News