DRF Protest: హైదరాబాద్‌లో మాన్సూన్ సర్వీసులకు బ్రేక్.. ఏం జరిగిందంటే
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:44 AM
DRF Protest: హైడ్రాకు డీఆర్‌ఎఫ్ బృందాలు మెరుపు షాక్ ఇచ్చాయి. హైడ్రా ఆఫీస్ ముందు డీఆర్‌ఎఫ్ సిబ్బంది ధర్నాకు దిగారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17: హైడ్రాకు (HYDRA) డిజాస్టర్ టీం భారీ షాక్ ఇచ్చింది. ఈరోజు (బుధవారం) ఉదయం హైడ్రా కార్యాలయం ముందు హైడ్రా డీఆర్ఎఫ్ (DRF) బృందాలు మెరుపు ధర్నాకు దిగాయి. జీతాలు తగ్గించారంటూ హైడ్రా తీరుకు నిరసనగా డీఆర్‌ఎఫ్ బృందాలు ధర్నా చేపట్టాయి. జీతంలో ఐదు వేలు కట్ చేశారని ఆందోళనకు దిగారు. రాత్రి పగలు అన్ని పనులు చేయించుకుని ఇలా చేయడంపై డీఆర్‌ఎఫ్ టీమ్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
డిజాస్టర్ టీం విధులు బహిష్కరించడంతో మాన్సూన్ సర్వీసులపై తీవ్ర ప్రభావం పడుతోంది. గతంలో జీహెచ్ఎంసీ అండర్లో ఈవీడీఎంలో డీఆర్ఎఫ్ సిబ్బంది పనిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైడ్రాలో డీఆర్ఎఫ్‌లో దాదాపు 1100 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై అందరికీ ఒకేలా అందేలారాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. ఈ జీవో కారణంగా 5000 రూపాయలు జీతం తగ్గిందంటూ డీఆర్ఎఫ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో సగానికి పైగా సిబ్బందికి ఈనెల 5000 రూపాయలు జీతం తగ్గిందంటూ హైడ్రా కార్యాలయం ముందు డీఆర్‌ఎఫ్ బృందాలు ఆందోళనకు దిగాయి. వీరి ధర్నాపై హైడ్రా ఏ విధంగా స్పందిస్తుందో అనేది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
తెలంగాణ విమోచన వేడుకల్లో రక్షణమంత్రి... జెండా ఆవిష్కరణ
Read Latest Telangana News And Telugu News