Share News

IT Raids: భాగ్యనగరంలో ఐటీ అధికారుల సోదాలు.. కీలక ఫైళ్లు స్వాధీనం

ABN , Publish Date - Nov 19 , 2025 | 08:54 AM

భాగ్యనగరంలో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, షాగౌస్, మైఫిల్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

IT Raids: భాగ్యనగరంలో ఐటీ అధికారుల సోదాలు.. కీలక ఫైళ్లు స్వాధీనం
IT Raids

హైదరాబాద్, నవంబరు18(ఆంధ్రజ్యోతి): భాగ్యనగరం (Hyderabad)లో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు (IT Raids) కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, షాగౌస్, మైఫిల్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రాజేంద్రనగర్ పిస్తాహౌస్ ఓనర్ నివాసంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఇవాళ(బుధవారం) బ్యాంకు ఖాతాలను పరిశీలించి, లాకర్లను ఓపెన్ చేయనున్నారు ఐటీ అధికారులు. షాగౌస్, మైఫిల్‌‌లో కూడా పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. రికార్డ్స్‌లోని ఆదాయం.. అసలు ఆదాయానికి మధ్య వ్యత్యాసాలు ఉండటంతో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

సినిమాల‌కు.. ఇక సెల‌వు! నటనకు వీడ్కోలు.. పలికిన న‌టి తులసి

Read Latest Telangana News and National New

Updated Date - Nov 19 , 2025 | 10:25 AM