Hydra Commissioner Ranganath: హైడ్రాకు మార్షల్స్ షాక్.. స్పందించిన రంగనాథ్
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:37 PM
హైడ్రా మార్షల్స్ ఆందోళన టీ కప్పులో తుఫాను లాంటిదని కమిషనర్ రంగనాథ్ చెప్పుకొచ్చారు. జీవో ప్రకారం ఒక స్కేల్ జీతం విడుదల చేశారని తెలిపారు. హైడ్రాలో పని చేస్తున్న వారి జీతాలు తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జీతాలు తగ్గించడంపై హైడ్రా మార్షల్స్ ఆందోళన చేపట్టారు. విధులను బహిష్కరించి తమకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. దీంతో హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలతోపాటు ట్రైనింగ్, ప్రజావాణి సేవలు నిలిచిపోయాయి. ఈ విషయంపై తాజాగా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా మార్షల్స్ ఆందోళనపై ఆయన ఇవాళ(సోమవారం) మీడియాతో మాట్లాడారు.
హైడ్రా మార్షల్స్ ఆందోళన టీ కప్పులో తుఫాను లాంటిదని కమిషనర్ రంగనాథ్ చెప్పుకొచ్చారు. జీవో ప్రకారం ఒక స్కేల్ జీతం విడుదల చేశారని తెలిపారు. హైడ్రాలో పనిచేస్తున్న వారి జీతాలు తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు. చిన్న కన్ఫ్యూజన్‌తో మార్షల్స్ ఆందోళన చెందారని వివరించారు. అందరికి అర్థం అయ్యేలా వివరించామని పేర్కొన్నారు. వాళ్ళు కూడా సంతోష పడ్డారని చెప్పారు. హైడ్రాలో పని చేస్తున్న మార్షల్స్‌కి ఇంకా జీతం పెరుగుతుందని రంగనాథ్ వెల్లడించారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్(MA&UD) శాఖ కూడా.. జీతాలు పెంచే అంశంపై పరిశీలన చేస్తుందని తెలిపారు. హైడ్రా మార్షల్స్ పట్ల ఏ అధికారి అమర్యాదగా ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలా ఎవరైనా చేస్తే.. నేరుగా తన దృష్టికి తీసుకురావాలని భరోసా ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో కూడా సమీక్షించి అక్కడ పరిస్థితిని చూసి జీతాలు పెంచే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. ఎక్కువ గంటలు పనిచేస్తే.. ఓవర్ టైమ్ ఇవ్వాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తామని రంగనాథ్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్టీ విలీనంపై కేసీఆర్ అత్యవసర సమావేశం..!
కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత బయటపడింది