Share News

Minister Seethakka: కారుకు పంక్చరై.. పనికి రాకుండా పోయింది..

ABN , Publish Date - Oct 14 , 2025 | 01:01 PM

గతంలో నచ్చని ఓట్లను తీసేసిన చరిత్ర బీఆర్ఎస్ ది అని మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసిన ఘనులు బీఆర్ఎస్ నేతలు అని విమర్శించారు. ప్రస్తుతం కారుకు పంక్చర్ అయింది.

Minister Seethakka:  కారుకు పంక్చరై.. పనికి రాకుండా పోయింది..
Minister Seethakka

హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ గొప్ప లీడర్ కాదు.. తప్పు లీడర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. ఇవాళ(మంగళవారం) ఆమె ABNతో మాట్లాడారు.. అబద్ధాలకు అంబాసిడర్ కేటీఆర్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్లు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2023 ఎన్నికల్లో కూడా ఆ ఓట్లు ఉన్నాయని ఆమె తెలిపారు. అవి దొంగ ఓట్లయితే దానికి కారణం మీరే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


గతంలో నచ్చని ఓట్లను తీసేసిన చరిత్ర బీఆర్ఎస్ ది అని మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసిన ఘనులు బీఆర్ఎస్ నేతలు అని విమర్శించారు. ప్రస్తుతం కారుకు పంక్చర్ అయింది. పనికి రాకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నది కాంగ్రెస్. ఇళ్లు ఇస్తామని మోసం చేసింది బీఆర్ఎస్ అని అన్నారు. బీసీ జీవో ఆగినందుకు బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోండి. మంత్రులం అందరం కలిసే ఉన్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు

వెంకటేష్‌ నాయుడి ఫోన్‌ అన్‌లాక్‌కు అనుమతి

Updated Date - Oct 14 , 2025 | 01:03 PM