Hyderabad Alert: ఢిల్లీలో భారీ పేలుడు.. హైదరాబాద్‌లో అలర్ట్..
ABN , Publish Date - Nov 10 , 2025 | 08:41 PM
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు యావత్ భారతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ చెకింగ్స్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు..
హైదరాబాద్, నవంబర్ 10: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు అలర్ట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం సైతం హై అలర్ట్ ప్రకటించడంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ చెకింగ్స్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పాతబస్తీతో పాటు హైదరాబాద్‌లోని సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటికీ హైఅలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఆయా నగరాల్లో సెక్యూరిటీని టైట్ చేశారు. ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. అటు, ఉత్తర ప్రదేశ్ లోనూ అప్రమత్తత ప్రకటించారు.
ఇవీ చదవండి:
వణికిస్తున్న కాలుష్యం.. ఢిల్లీకి వెళ్లే విమానం దాదాపుగా ఖాళీ!
టాక్సీ బుకింగ్.. జర్మనీ టూరిస్టులకు గోవాలో ఇక్కట్లు