Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఇక తెలంగాణ ప్రభుత్వం చేతికి, రెండో దశకు ముందడుగు..!
ABN , Publish Date - Sep 25 , 2025 | 09:35 PM
హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ నిర్వహణ బాధ్యతల నుంచి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ తప్పుకోబోతోంది. ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రాబోతోంది. రెండో దశ నిర్మాణానికి మార్గం సుగమం చేసేలా..
హైదరాబాద్, సెప్టెంబర్ 25: హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ నిర్వహణ బాధ్యతల నుంచి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ తప్పుకోబోతోంది. ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రాబోతోంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, ఎల్ అండ్ టీ సీఎండీ మధ్య ఇవాళ(గురువారం) అంగీకారం కుదిరింది. దీంతో హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినట్లైంది.
ఎల్ అండ్ టీ గ్రూప్ CMD S.N. సుబ్రహ్మణ్యన్ తోపాటు, సంస్థ అధికారులు నేడు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, ఎల్ అండ్ టీ ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇందులో భాగంగా ఎల్‌అండ్‌టీకి ఉన్న రూ.13వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో పాటు, ఎల్‌అండ్‌టీకి రూ.2,100 కోట్లు నగదు చెల్లించేందుకు కూడా రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది.
దీంతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణం వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి భారత ప్రభుత్వ ఆమోదం పొందేలా చేయాలనే లక్ష్యంతో ఇరుపక్షాల మధ్య చర్చలు జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్ మెట్రో 69 కి.మీ.మొదటి దశని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.22 వేల కోట్లతో నిర్మించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ మెట్రోకు సంబంధించి కీలక పరిణామాలు :
2014లో 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో నెట్‌వర్క్, ఇప్పుడు 9వ స్థానంలోకి పడిపోయింది
🔴 తెలంగాణ ప్రభుత్వం ఫేజ్-2A & 2Bలో 163 కి.మీ. కొత్త మెట్రో లైన్లు ప్రతిపాదన
🔴 ఫేజ్-2 అప్రూవల్ కోసం L&Tతో డిఫినిటివ్ అగ్రిమెంట్ సంతకం కోరిన కేంద్రం
🔴 L&T – ఫేజ్-2లో ఈక్విటీ పార్టనర్‌గా పాల్గొనలేమని స్పష్టం
🔴 తమ ఈక్విటీ వాటా రాష్ట్రం లేదా సెంటర్ కొనుగోలు చేసుకోవచ్చని L&T సూచన
🔴 సీఎం రేవంత్ రెడ్డి – ఫేజ్-1 & ఫేజ్-2 ఆపరేషనల్ ఇంటిగ్రేషన్ కోసం L&Tకి విజ్ఞప్తి
🔴 L&T – ఫేజ్-1, ఫేజ్-2 ఆపరేషన్ల సమన్వయం, రెవెన్యూ పంచుకోలుపై ఆందోళన
🔴 రాష్ట్ర ప్రభుత్వం – ఫేజ్-1 ప్రాజెక్ట్ మొత్తం టేకోవర్ చేయాలని ప్రతిపాదన
🔴 ఫేజ్-1 ప్రాజెక్ట్ అప్పు రూ.13,000 కోట్లు – రాష్ట్రం భరిస్తుందని అంగీకారం
🔴 ఈక్విటీ విలువ రూ.2,000 కోట్లు – L&Tకి చెల్లింపు ప్రతిపాదన
🔴 టేకోవర్ షరతులు పరస్పర చర్చలతో తేల్చుకోనున్నారు
🔴 మీటింగ్‌లో రాష్ట్ర సలహాదారులు, అధికారులు – L&T టాప్ మేనేజ్‌మెంట్ పాల్గొన్నారు
ఇవి కూడా చదవండి:
హెచ్-1బీ వీసాదారుల్లో 80 శాతం మాయం.. అమెరికన్లకు ఇదే ఛాన్స్.. నెటిజన్ పోస్టుపై నెట్టింట డిబేట్
యూపీఐ అంటే ఇదీ.. పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో సంబరపడ్డ జంట