Suryakumar - ICC Warning: పహల్గాం కామెంట్స్.. సూర్యకుమార్ యాదవ్‌కు ఐసీసీ వార్నింగ్
ABN , Publish Date - Sep 25 , 2025 | 08:49 PM
పాక్‌తో తొలి మ్యాచ్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పహల్గాం కామెంట్స్‌పై ఐసీసీ సీరియస్ అయ్యింది. అతడిపై జరిమానా విధించే అవకాశం కూడా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: పాక్‌తో తొలి మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన పహల్గాం కామెంట్స్‌పై ఐసీసీ సీరియస్ అయింది. అతడిపై జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు కూడా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పాక్‌తో తొలి మ్యాచ్ అనంతరం పత్రికా సమావేశంలో సూర్యకుమార్ మాట్లాడిన విషయం తెలిసిందే. పహల్గాం దాడి బాధితులకు సంఘీభావం తెలిపాడు. టీమిండియా విజయాన్ని భారత సాయుధ దళాలకు అంకితమిస్తున్నానని అన్నారు (Suryakumar Yadav ICC warning).
ఈ నేపథ్యంలో ఐసీసీ జరిపిన విచారణకు సూర్యకుమార్‌తో పాటు బీసీసీఐ సీఓఓ హేమంగ్ అమిన్, క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ హాజరయ్యారు. ఈ విచారణకు రిచీ రిచర్డ్‌సన్ నేతృత్వం వహించారు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌పై జరిమానా లేదా డీమెరిట్ పాయింట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి (Pahalgam comment cricket).
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇది భారత్, పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణానికి దారి తీసింది. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన భారత్ పాక్‌లోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అనంతరం, జరుగుతున్న ఆసియా కప్‌లో పాక్‌తో కలిసి పాల్గొనద్దని పలువురు డిమాండ్ చేశారు. అయితే, పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు మాత్రమేని తాము వ్యతిరేకమని బీసీసీఐ పేర్కొంది (Asia Cup 2025 controversy). వివిధ టీమ్‌లు పాల్గొనే టోర్నీలను బాయ్‌కాట్ చేస్తే జరిమానాలు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత క్రీడాకారులు పాక్ టీమ్‌ను తమ మౌనంతో పరోక్షంగా బాయ్‌కాట్ చేశారు. ఇటీవల మ్యాచ్‌లో హరీస్ రవూఫ్, షాహిబ్‌జాదా పర్హాలు రెచ్చగొట్టే రీతిలో చేసిన సైగలపై కూడా భారత్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై ఐసీసీ త్వరలో మరో విచారణ జరపనుంది.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి