Malkajgiri News: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడి.. ఆపై పోలీస్ స్టేషన్ ఎదురుగా..
ABN , Publish Date - Nov 05 , 2025 | 10:44 AM
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట సింగిరెడ్డి మీన్ రెడ్డి(32) అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు, స్థానికులు రక్షించడానికి ప్రయత్నం చేయగా.. అప్పటికే మీన్‌రెడ్డి మృతి చెందాడు.
హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఓ వ్యక్తి కుశాయిగూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సింగిరెడ్డి మీన్‌రెడ్డి(32) అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు, స్థానికులు రక్షించడానికి ప్రయత్నం చేయగా.. అప్పటికే మీన్‌రెడ్డి మృతి చెందాడు. అనంతరం మీన్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మీన్‌రెడ్డిని దమ్మాయిగూడ నివాసిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read:
నేడు కార్తీక పౌర్ణమి.. ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షమే..
గుడ్ న్యూస్.. మరింతగా తగ్గిన బంగారం, వెండి ధరలు