TG News: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
ABN , Publish Date - Jul 01 , 2025 | 10:51 AM
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించ నున్నారు. అమ్మవారి కల్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. 11.55 నిమిషాలకు అమ్మవారి కల్యాణం జరుగనుంది.
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని (Balkampet Yellamma Thalli Kalyanam) ఇవాళ(మంగళవారం) వైభవంగా నిర్వహించనున్నారు. అమ్మవారి కల్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. 11:55 నిమిషాలకు ఎల్లమ్మ కల్యాణం వైభవంగా జరుగనుంది. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో వచ్చే మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి వార్షిక కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కల్యాణం కోసం ఆలయాన్ని నిర్వాహకులు సుందరంగా ముస్తాబు చేశారు.
ఇవాళ ఉదయం 5 గంటల నుంచే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్‌లు, వీఐపీ ఎంట్రీ కోసం క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అమ్మవారి కల్యాణాన్ని చూడటానికి భక్తులు, శివసత్తులు భారీగా తరలి వచ్చారు. అమ్మవారి దర్శనానికి ఐదుగంటలకు పైగా సమయం పడుతోంది. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు నేతలు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు కల్యాణ వేడుకలు జరుగనున్నాయి. మొదటి రోజు పెళ్లికూతురు, ఎదుర్కొళ్ల కార్యక్రమం, రెండో రోజు కల్యాణం, మూడో రోజు రథోత్సవం జరుగనుంది. అమ్మవారి కల్యాణం సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సనత్‌నగర్, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట్, నాలుగు మార్గాల్లోని రోడ్లను మూసివేశారు.
అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి: ఎమ్మెల్యే దానం నాగేందర్
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎల్లమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకున్నారు. తల్లి కల్యాణం సమయంలో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ప్రతి ఏడాది వస్తుంటానని తెలిపారు. గత సంవత్సరం జరిగిన తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా తమ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో అధికారులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. జీహెచ్ఎంసీ, పోలీస్, మెడికల్ ఇలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని దానం నాగేందర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పాశమైలారం పేలుడు ఘటన.. 37 మంది మృతి
Read latest Telangana News And Telugu News