Share News

Student Died in Hyderabad: ఐడీ కార్డు ట్యాగ్‌తో బాలుడు ఆత్మహత్య

ABN , Publish Date - Dec 16 , 2025 | 09:31 PM

హైదరాబాద్‌ చందానగర్‌ రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

Student Died in Hyderabad: ఐడీ కార్డు ట్యాగ్‌తో బాలుడు ఆత్మహత్య

హైదరాబాద్, డిసెంబర్ 16: చందానగర్‌ రాజేందర్ రెడ్డి నగర్‌ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి ప్రశాంత్ (9) ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం తన ఇంటిలోని బాత్‌ రూంలో స్కూల్ ఐడీ కార్డు ట్యాగ్‌తో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్‌ రూమ్‌లోకి వెళ్లిన ప్రశాంత్ ఎంతకీ బయటకు రాకపోవడంతో.. తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాత్ రూం తలుపు కొట్టిన అతడి నుంచి స్పందన లేదు. దాంతో బాత్ రూం తలుపు పగలకొట్టారు. నేలపై కుమారుడు విగత జీవిగా పడి ఉన్నాడు.


ఈ ఘటనపై పోలీసులకు ప్రశాంత్ తల్లిదండ్రులు సమాచారం అందించారు. పోలీసులు ప్రశాంత్ నివాసానికి వచ్చి.. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్ మార్గం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ప్రశాంత్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతికి గల కారణాలపై అతడి తల్లిదండ్రులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి ప్రశాంత్ నివసిస్తున్నాడు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ సాయంత్రానికి డ్రామా మొదలైంది: సీఎం చంద్రబాబు

తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్

For More TG News And Telugu News

Updated Date - Dec 16 , 2025 | 10:04 PM