Miyapur: మియాపూర్ పోలీస్ స్టేషన పరిధిలో దారుణం..
ABN , Publish Date - Dec 24 , 2025 | 02:55 PM
మియాపూర్ పోలీస్ స్టేషన పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పిల్లలు ఉన్నారు. జల్సాలు మానుకోవాలంటూ మూడు మూళ్లు వేసిన భర్తకు సూచించింది. అయినా భర్త పద్దతి మార్చుకోలేదు.
హైదరాబాద్, డిసెంబర్ 23: భర్త రాజు జల్సాలకు అలవాటు పడ్డాడు. పద్దతు మార్చుకోవాలంటూ భర్తకు భార్య విజయలక్ష్మీ పదే పదే సూచించింది. విజయలక్ష్మీ సూచనను రాజు పెడ చెవిన పెట్టాడు. దాంతో భర్త వ్యవహార శైలిపై అతడి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయాలని విజయలక్ష్మీ నిర్ణయించింది. అతడి తల్లిదండ్రుల వద్దకు వెళ్తుండగా.. విజయలక్ష్మీని భర్త రాజు అడ్డగించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒకానొక సమయంలో ఆగ్రహాన్ని పట్టలేక.. విజయలక్ష్మీపై రాజు పిడిగుద్దులు గుద్దాడు. దాంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
దాంతో ఆమెను వెంటనే రాజు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. భర్త రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విజయలక్ష్మీ మృతదేహాన్ని పోలీసుల స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
గత 8 ఏళ్లుగా మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో ఇద్దరు పిల్లలతో కలిసి రాజు, విజయలక్ష్మీ ఉంటున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. గత కొంత కాలంగా రాజు విపరీతంగా జల్సాలకు అలవాడు పడ్డాడని స్థానికులు వెల్లడించారు. పద్దతి మార్చుకోవాలంటూ భార్య పదే పదే చెప్పేదని.. దీంతో ఇరువురి మధ్య పలుమార్లు గోడవ పడేవారని పోలీసుల విచారణలో స్థానికులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవాలి
గత ప్రభుత్వ అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్.. మోదీ రియాక్షన్
For More TG News And Telugu News