Share News

Holi celebrations: ఘనంగా హోలీ సంబురాలు.. పోలీసుల ఆంక్షలు

ABN , Publish Date - Mar 14 , 2025 | 07:26 AM

Holi celebrations: హైదరాబాద్‌లో హోలీ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, మహిళలు తారతమ్యం లేకుండా రంగులు ఒకరిపై ఒకరు జల్లుకుంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.

  Holi celebrations: ఘనంగా హోలీ  సంబురాలు..  పోలీసుల ఆంక్షలు
Holi celebrations

హైదరాబాద్: భాగ్యనగరంలో ఇవాళ(శుక్రవారం) హోలీ సంబురాలు ఘనంగా జరిగాయి. హోలీ పండుగ సందర్బంగా యువతీ యువకులు రంగులతో ముంచెత్తారు. యువతీ యువకులు రంగులు జల్లుకుంటూ సంబరంగా వేడుకలు చేసుకున్నా రు. యువత బ్యాండ్‌ మేళాలతో నృత్యాలు చేస్తూ సంబురాల్లో మునిగి తేలిపోయారు. యువత రంగులు జల్లుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విద్యార్థుల రంగులు జల్లుకొని ఆనందగా వేడుకలను ఆస్వాదించారు. సిటీలో పలు ప్రాంతాల్లో హోలీ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. డీజేల హోరు, బ్యాండ్ బాజాతో యువత సందడి చేస్తుంది.హోటల్స్, కన్వెన్షన్ సెంటర్స్, రిసార్ట్స్, గ్రౌండ్స్‌లో హోలీ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. డిఫరెంట్ థీమ్స్‌తో ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్లాన్ చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈవెంట్స్ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు.


హోలీ సందర్భంగా ఈరోజు హైదరాబాద్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌లో రేపు (శనివారం) ఉదయం 6 గంటల వరకు పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తునట్లు పోలీసులు తెలిపారు. రోడ్లపై గుంపులుగా తిరగొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులపై రంగులు జల్లొద్దని పోలీసులు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Trains: రైల్వే ప్రయాణికులకో గుడ్ న్యూస్.. అందేంటంటే..

Bandi Sanjay: 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టదా?

Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్‌ నేతల రహస్య భేటీలు

Read Latest Telangana News and Telugu News

Updated Date - Mar 14 , 2025 | 10:35 AM