Share News

Hyderabad: హైదరాబాద్‌లో హై టెన్షన్.. అసలు కారణమిదే

ABN , Publish Date - Feb 12 , 2025 | 02:43 PM

Hyderabad Hanuman Temple: హైదరాబాద్‌లో హై టెన్షన్ నెలకొంది. హైదరాబాద్‌ పాతబస్తీ టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయంలో అపచారం జరిగింది. ఆలయంలోని శివలింగం వెనుక గుర్తు తెలియని దుండగులు మాంసం పడేశారు. మాంసం చూసి భక్తులు కంగుతిన్నారు. వెంటనే ఆలయ సిబ్బంది, భక్తులు పోలీసులకు సమాచారం అందించారు.

 Hyderabad: హైదరాబాద్‌లో హై టెన్షన్.. అసలు కారణమిదే
Hanuman temple incident

హైదరాబాద్: హైదరాబాద్‌ పాతబస్తీ టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయంలో ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున అపచారం జరిగింది. హనుమాన్ దేవాలయంలోని శివాలయంలో శివలింగం వెనుక భాగంలో గుర్తుతెలియని దుండగులు మాంసపు ముద్దను వేయడంతో ఉదయం దర్శనానికి వచ్చిన భక్తులు ఇది గమనించి ఆందోళనకు గురయ్యారు దీంతో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు, హిందువులు దేవాలయం వద్దకు చేరుకొని రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం జరగాలని నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ సిబ్బంది, భక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు.


అపవిత్రం చేస్తే సహించేది లేదు: రాజాసింగ్

rajasingh.gif

ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆలయాలను అపవిత్రం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే అనేక చోట్ల ఇదే జరిగిందని అన్నారు. పోలీసులు ఇలాంటి కేసుల్లో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. పవిత్ర ఆలయాల్లో కొంతమంది కావాలని ఆవు మాంసం పడేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.


నిందితులను పట్టుకుని శిక్షిస్తాం: హైదరాబాద్ జాయింట్ సీపీ విక్రమ్ సింగ్

ఆలయంలో ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హైదరాబాద్ జాయింట్ సీపీ విక్రమ్ సింగ్ హెచ్చరించారు. సంఘటన స్థలాన్ని ఇవాళ సీపీ విక్రమ్ సింగ్ పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడ సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని ఈరోజు సాయంత్రం వరకు అక్కడ సీసీటీవీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కచ్చితంగా పోలీసులు నిందితులను పట్టుకొని వారిపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతవరకు సమన్వయం పాటించాలని ప్రజలను కోరారు.

Updated Date - Feb 13 , 2025 | 07:13 AM