Hema on Manchu Lakshmi : మంచు లక్ష్మి ఇష్యూపై నటి హేమ కామెంట్స్
ABN , Publish Date - Sep 20 , 2025 | 08:13 PM
మంచు లక్ష్మి ఇష్యూపై సహ నటి హేమ కామెంట్స్ చేశారు. ఆమెను ఒక జర్నలిస్ట్ బాడీ షేమింగ్ చేస్తుంటే ఎవరూ ఖండించలేదని, 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సొంత సిస్టర్ కే ఇలాంటి పరిస్దితి వస్తే ఎలాగని ప్రశ్నించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 20: టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ఇష్యూపై సహ నటి హేమ కామెంట్స్ చేశారు. సినిమా వాళ్లు లోకువయ్యారా? అంటూ ఆమె విరుచుకుపడ్డారు. మంచు లక్ష్మీని ఒకరు బాడీ షేమింగ్ చేస్తుంటే ఎవరూ ఖండించలేదని హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సొంత సిస్టర్ కే ఇలాంటి పరిస్థితి వస్తే.. మిగతా చిన్న ఆర్టిస్ట్ ల పరిస్థితి ఏంటని ఆమె నిలదీశారు. గతంలో తనపైనా అబద్ధాలు ప్రచారం చేశారని.. దాని వల్ల తన 'మా' మెంబర్షిప్ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి కష్టం మీద తాను తిరిగి 'మా' అసోసియేషన్ లోకి వచ్చానని హేమ గుర్తుచేసుకున్నారు. యాంకర్ సుమపైనా కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మీ విషయంలో 'మా' అసోషియన్ , ఫిలిం ఛాంబర్ రెస్పాండ్ అవ్వాలని హేమ డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, తనను ఒక సీనియర్ జర్నలిస్ట్ బాడీ షేమింగ్ చేశాడని, అతడిపై యాక్షన్ తీసుకోవాలని మంచులక్ష్మి ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లక్ష్మి నటించిన దక్ష సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూకు వెళ్లిన ఆమెను సదరు జర్నలిస్ట్.. 'మీరు 50 ఏళ్ల వయస్సులో చిన్నచిన్న బట్టలు వేసుకుని ఫొటోలు పెట్టేముందు ఎలాంటి కామెంట్స్ వస్తాయనేది అనుకునే పెడతారా? అని అడిగారు. ఇది మంచులక్ష్మిని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.
ఇక సదరు జర్నలిస్ట్ ప్రశ్నకు మంచు లక్ష్మీ కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. 'ఇదే ప్రశ్న మహేష్ బాబును అడగగలరా?.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. మీరే జనాలకు నేర్పిస్తున్నారు' అంటూ ఫైర్ అయ్యింది. అక్కడితో ఆ వివాదం ముగిసిందనుకుంటే మంచు లక్ష్మి నిన్న.. ఆ జర్నలిస్ట్ పై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసింది. తనను సదరు జర్నలిస్ట్ బాడీ షేమింగ్ చేశాడని తెలుపుతూ చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఇప్పటివరకూ జర్నలిస్ట్ పై ఫిల్మ్ ఛాంబర్ యాక్షన్ తీసుకోలేదని తెలుస్తోంది. ఇక ఈ వివాదంపై తాజాగా నటి హేమ ఫైర్ అయ్యారు. మంచు లక్ష్మీకి మద్దతు పలుకుతూ మంచు విష్ణును స్పందించాల్సిందిగా కోరారు.
ఇవి కూడా చదవండి:
చాబహార్ పోర్టుపై భారత్‌కు ఇచ్చిన మినహాయింపులు రద్దు.. అమెరికా నిర్ణయం
అమెరికా చట్టసభల భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..