Supreme Court: ఎమ్మెల్యేల అనర్హత కేసు.. మరోసారి సుప్రీం కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 10 , 2025 | 12:19 PM
Supreme Court: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాదిని మరోసారి ప్రశ్నించింది సుప్రీం ధర్మాసనం. రిజనబుల్ టైం అంటే ఏంటి అంటూ సూటిగా ప్రశ్నించింది. మరోసారి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: తెలంగాణలో (Telangana) ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో (Supreme Court) సోమవారం జరిగిన విచారణ వాయిదా పడింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకటరావు సహా ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లతో కలిపి ఈరోజు కేసు విచారణ జరిగింది. జస్టిస్ బి ఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రీజనబుల్ టైమ్ అంటే ఏంటి? అని మరోసారి సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. పది నెలలు అనేది రీజనబుల్ టైం కాదు అని ధర్మాసనం పేర్కొంది. కేసు విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ వరుస పిటిషన్లు దాఖలు చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో పాటు వివేకానంద గౌడ దాఖలు చేసిన రెండు పిటిషన్లతో పాటు ఇటీవల తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి, వివేకా కలిసి పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై పిటిషన్ వేయగా.. మరో ఏడుగురి పేర్లను జత చేసి కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు పిటిషన్లను జత చేసి ఈరోజు సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.
Shocking Video: పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి..
విచారణ సమయంలో రీజినబుల్ టైం అంటే ఏంటి.. పది నెలలు రీజనబుల్ టైం కాదని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కూడా కేసు విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. బీఆర్‌ఎస్ పార్టీ తరపున ఆర్యంనామసుందరం వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి దాదాపు 10 నెలలు అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని... వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ముందు వాదనలు వినిపించారు బీఆర్‌ఎస్ తరపు న్యాయవాది. అనంతరం కేసు విచారణను 18కి వాయిదా వేసింది ధర్మాసనం. ఈ క్రమంలో 18న జరగబోయే వాదనలపై ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి...
Minister Komatireddy: మహాకుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పుణ్యస్నానం
Fire Accident.. పాతబస్తీ దివాన్‌దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం..
Read Latest Telangana News And Telugu News