Harish Rao: రేవంత్ మాటలు వింటే అబద్ధాలు సైతం ఆత్మహత్య చేసుకొంటాయి
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:35 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు అబద్ధాలు సైతం ఆత్మహత్య చేసుకుంటాయని ఆయన ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 09: తెలంగాణ ముఖ్యమంత్రి, గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి.. గోబెల్స్‌కు తాతగా మారిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు వ్యంగ్యంగా అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు వింటే అబద్ధాలు సైతం ఆత్మహత్య చేసుకుంటాయన్నారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్లతోనే సీఎం రేవంత్ రెడ్డి.. మూసీ ప్రాజెక్టును చేపట్టారని ఎద్దేవా చేశారు. మూసీకి ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నీళ్లు వస్తున్నాయని రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారంటూ మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజక్టులో భాగంగానే మల్లన్నసాగర్‌కు నీళ్లు వస్తున్నాయన్నారు హరీష్ రావు. కేసీఆర్ నిర్మించిన మల్లన్నసాగర్ హైదరాబాద్‌కు వరంగా మారిందని స్పష్టం చేశారు. నిజాలు ఒప్పుకుని.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. అన్నీ వదిలేసి.. నడి బజారులో నిలబడినట్లుగా ముఖ్యమంత్రి తీరు ఉందంటూ నిప్పులు చెరిగారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజక్టులకు రిబ్బన్లు కట్ చేయటానికి.. జేబులో కత్తెర పెట్టుకుని రేవంత్ రెడ్డి తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి తగ్గిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కవిత సంచలన కామెంట్స్..
For More Telangana News and Telugu News..