GHMC Council: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:22 AM
GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన వెంటనే గందగోళపరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగట్లేదని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఫ్లకార్డులు పట్టుకుని కౌన్సిల్ మీటింగ్‌కు వచ్చారు. మేయర్ పోడియంపై బీఆర్‌ఎస్ సభ్యులు ప్లకార్డులు విసిరారు. బీఆర్‌ఎస్ సభ్యులను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు.

హైదరాబాద్, జనవరి 30: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ (GHMC Council Meeting) సమావేశం రసాభాసగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Gadwala Vijayalaxmi) అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. అయితే సమావేశం మొదలైన వెంటనే గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతామని మేయర్ చెప్పగా.. అందుకు బీఆర్‌ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ససేమిరా అన్నారు. ముందు ప్రజా సమస్యలపై మాట్లాడాలని రెండు పార్టీల సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులు పట్టుకుని మేయర్ పోడియం వద్దకు వచ్చిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్.. బీఆర్‌ఎస్ సభ్యుల నుంచి ప్లకార్డులను లాక్కొని చించేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్పొరేటర్లు ఒకరినొకరు తోసేసుకున్నారు. సమావేశం మొదలైన ఐదు నిమిషాల్లోనే తీవ్ర గందరగోళం నెలకొనడంతో మార్షల్స్ కౌన్సిల్ మీటింగ్‌లోకి ప్రవేశించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు తోసుకోవడంతో పాటు దుర్భాషలాడుకున్నారు. మేయర్ పోడియంపై బీఆర్‌ఎస్ సభ్యులు ప్లకార్డులు విసిరారు. వెంటనే మార్షల్స్ అక్కడకు చేరుకుని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నేటి నుంచి ‘వాట్సాప్ పరిపాలన’
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను రాష్ట్రంలో అమలుకావడం లేదని, గ్రేటర్ హైదరాబాద్‌లో నిధులు ఎక్కడిక్కడ దుర్వినియోగం అవుతున్నాయని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగట్లేదని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఫ్లకార్డులు పట్టుకుని కౌన్సిల్ మీటింగ్‌కు వచ్చారు. మేయర్ వద్దకు దూసుకెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ కార్పేరేటర్లు సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్ వారిని అడ్డుకున్నారు. వెంటనే మార్షల్స్ అక్కడకు చేరుకుని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేశారు. మరోవైపు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు ఒకటే అని అందుకే సమావేశం ముందుకు జరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని కమలం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
నేటి నుంచి ‘వాట్సాప్ పరిపాలన’
Read Latest Telangana News And Telugu News