Harish Rao: రేవంత్ సర్కార్ విఫలం అయింది : హరీష్ రావు
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:19 PM
తెలంగాణ వరుసగా రెండో నెల కూడా ద్రవ్యోల్బణంలోకి జారుకుందని హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థ రివర్స్ గేర్‌లో ఉందనడానికి ఇది ప్రమాదకరమైన సంకేతమని తెలిపారు. డిమాండ్ కుప్పకూలిపోతున్నా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్క నుండి చూస్తోందని విమర్శించారు.
హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కాంగ్రెస్ సర్కార్‌పై ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక నిర్వహణలో వైఫల్యం చెందారని.. ఆయన ఆరోపించారు. రాష్ట్రం ప్రమాదకర ద్రవ్యోల్బణ స్థాయిలోకి ప్రవేశించిందని తెలిపారు. ఆయన ఇవాళ(గురువారం) మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ వరుసగా రెండో నెల కూడా ద్రవ్యోల్బణంలోకి జారుకుందని హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థ రివర్స్ గేర్‌లో ఉందనడానికి ఇది ప్రమాదకరమైన సంకేతమని తెలిపారు. డిమాండ్ కుప్పకూలిపోతున్నా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్క నుండి చూస్తోందని విమర్శించారు. ఆరోగ్యకరమైన వృద్ధిని నిర్ధారించడానికి భారత రిజర్వ్ బ్యాంక్ కూడా ద్రవ్యోల్బణాన్ని 2-6శాతం మధ్య ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుందని సూచించారు. కానీ తెలంగాణ ఇప్పుడు 0 శాతం కంటే తక్కువగా ఉందని వివరించారు. గ్రామీణ, పట్టణ ద్రవ్యోల్బణం జూన్‌లో -0.93% ఉంటే.. జూలైలో -0.44% కు పడిపోయిందని పేర్కొన్నారు. ఇది విజయం కాదు.. ఇది ఆర్థిక రెడ్ అలర్ట్ ఆయన స్పష్టం చేశారు.