Fire accident: మైలార్ దేవ్ పల్లిలో మళ్లీ అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Sep 07 , 2025 | 05:25 PM
మైలార్ దేవ్ పల్లిలో మళ్లీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో భారీగా పొగతోపాటు మంటలు వ్యాపించాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 07: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో మళ్లీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ డివిజన్‌లోని టాటా నగర్‌లో ప్లాస్టిక్ తయారీ సంస్థకు చెందిన గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతోపాటు భారీగా మంటలు వ్యాపించాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని.. సహయక చర్యలు చేపట్టారు.
రెండు ఫైరింజన్లతో దాదాపు రెండు గంటలు పాటు శ్రమించి.. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఆదివారం సెలవు దినం కావడంతో.. గోదాంలో సిబ్బంది ఎవరు లేరని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఘటన జరిగిన సమయంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మూసీ పునరుజ్జీవన పథకంలో కీలక అడుగు
దసరా ఉత్సవాలకు అదనపు శోభ తీసుకువచ్చేందుకు విజయవాడ ఉత్సవ్
Read Latest TG News and National News