Share News

Kesineni Chinni: దసరా ఉత్సవాలకు అదనపు శోభ తీసుకువచ్చేందుకు విజయవాడ ఉత్సవ్

ABN , Publish Date - Sep 07 , 2025 | 03:16 PM

విజయవాడ అంటే వైబ్రెంట్ నగరమని స్థానిక ఎంపీ కేశినేని చిన్ని అభివర్ణించారు. ఇక్కడ నుంచి వెళ్లిన వ్యక్తులు లక్షల ఉద్యోగాలు కల్పించారని ఆయన గుర్తు చేశారు.

Kesineni Chinni: దసరా ఉత్సవాలకు అదనపు శోభ తీసుకువచ్చేందుకు విజయవాడ ఉత్సవ్

విజయవాడ, సెప్టెంబర్ 07: దసరా ఉత్సవాలకు అదనపు శోభ తీసుకువచ్చేందుకు విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నామని స్థానిక ఎంపీ, టీడీపీ నేత కేశినేని చిన్ని వెల్లడించారు. ఆదివారం పోరంకిలో విజయవాడ ఉత్సవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. దేశమంతా ఈ ఉత్సవాలను చూపించాలనే ఉద్దేశ్యంతో విజయవాడ ఉత్సవ్‌ను చేపడుతున్నట్లు వివరించారు.

ఇది ప్రజల సహకారంతో.. ప్రజల కోసం జరిగే కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్సవ్ ద్వారా వ్యాపార రంగంతో సహా మిగిలిన అన్ని రంగాలు మరింత అభివృద్ది జరిగేందుకు దోహదపడుతుందని ఎంపీ కేశినేని చిన్ని అభిప్రాయపడ్డారు. విజయవాడ అంటే వైబ్రెంట్ నగరమని అభివర్ణించారు. ఇక్కడ నుంచి వెళ్లిన వ్యక్తులు లక్షల ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు.


విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ.. విజయవాడ ఉత్సవ్‌ను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. మైసూర్‌లో జరిగే దసరా ఉత్సవాలను మించి ఈ విజయవాడ ఉత్సవ్ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ ప్రజలకు చేతకానిదంటూ ఏమీ లేదని చెప్పారు.


విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. విజయవాడ.. రాజకీయ చైతన్యం కలిగిన నగరమని పేర్కొన్నారు. రాజధాని అమరావతిని ఘనంగా నిర్మించుకుంటున్నామన్నారు.


పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద కార్యక్రమం జరగబోతుందని తాను ఊహించలేదన్నారు. ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ఈ విజయవాడ ఉత్సవ్ జరగనుందని ఆయన పేర్కొన్నారు.


జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ.. విజయవాడ ప్రమోట్ అయ్యేందుకు ఈ ఈవెంట్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.


ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటి సంయుక్త మీనన్, దివ్య హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా ఫేమినా మిస్ ఇండియా 2020 మానసా వారణాసి హాజరయ్యారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ సందర్భంగా ప్రదర్శనలు నిర్వహించారు.

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై దుష్ప్రచారం.. జగన్ అండ్‌కోకు నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్

ఏపీ లిక్కర్ స్కాం కేసు.. హై కోర్టుకు సిట్ అధికారులు.. ఎందుకంటే..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 07 , 2025 | 03:41 PM