CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవన పథకంలో కీలక అడుగు
ABN , Publish Date - Sep 07 , 2025 | 03:55 PM
హైదరాబాద్ నగర ప్రజలకు ప్రతి రోజు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3 పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 07: మూసీ పునరుజ్జీవన పథకంలో కీలక అడుగు పడింది. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3 పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ. 7,360 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను రాష్ట్రప్రభుత్వం చేపట్టనుంది.
రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలించనున్నారు. అలాగే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపడంతో పాటు మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీలు కేటాయింపులు జరపనుంది. మిగతా 17.50 టీఎంసీలు హైదరాబాద్ తాగు నీటి అవసరాలకు వినియోగించనున్నారు. ఆ మార్గ మధ్యలోని 7 చెరువులను సైతం నింపుతారు.
డిసెంబర్ 2027 నాటికి హైదరాబాద్ తాగు నీటి అవసరాలు తీర్చేందుకు, ప్రతి రోజూ నల్లా నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ఇందులో ప్రభుత్వం 40 శాతం పెట్టుబడి వాటా పెడుతుండగా.. 60 శాతం నిధులను కాంట్రాక్ట్ కంపెనీ సమకూర్చనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై దుష్ప్రచారం.. జగన్ అండ్‌కోకు నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్
దసరా ఉత్సవాలకు అదనపు శోభ తీసుకువచ్చేందుకు విజయవాడ ఉత్సవ్
Read Latest TG News and National News