Share News

KCR Admitted In Hospital: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్

ABN , Publish Date - Jul 03 , 2025 | 07:12 PM

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరికాసేపట్లో కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.

KCR Admitted In Hospital: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్
BRS Chief KCR

హైదరాబాద్, జులై 03: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఇవాళ(గురువారం) ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, వారం రోజులుగా జలుబు, దగ్గు, తలనొప్పితోపాటు సీజనల్ జర్వం ఆయన్ని ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే గురువారం నాడు ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసానికి కుటుంబసభ్యులతో కలిసి కేసీఆర్ చేరుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చేరారు.


అదీకాక.. జూన్ 11వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సైతం ఆయన కొంత అస్వస్థతతో ఉన్నారు. ఆ సమయంలో కమిషన్ ఎదుట విచారణ నేపథ్యంలో ఒపెన్ కోర్టుకు తాను రాలేనని.. ఇన్‌సైడ్ విచారణకు హాజరవుతానంటూ కమిషన్‌కు ఆయన స్పష్టం చేశారు. అందుకు కమిషన్ సానుకూలంగా స్పందించింది. దీంతో ఇన్ సైడ్ విచారణకు కేసీఆర్ హాజరైన సంగతి తెలిసిందే.


ఈ విచారణ అనంతరం కేసీఆర్.. నేరుగా తన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఇవాళ తన ఫామ్ హౌస్ నుంచి నేరుగా నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. అయితే అక్కడ కేసీఆర్‌కు డాక్టర్లు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. కానీ మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని.. అందుకు ఆసుపత్రిలో చేరాలంటూ సూచించారు.


దీంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ చేరారు. కేసీఆర్ వెంట ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు. మరికాసేపట్లో కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్ ఆసుపత్రిలో చేరడంతో.. సోమాజిగూడకు భారీఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. కాగా, యశోద ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

ఇవి కూడా చదవండి

రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..

తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్

టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 03 , 2025 | 09:38 PM