Share News

Cyber Fraud: డాక్టర్‌ను ట్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.14 కోట్లు స్వాహా

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:44 AM

సైబర్ నేరగాళ్ల మోసానికి ఓ డాక్టర్ భారీగా నగదును పోగొట్టుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ను సైబర్ కేటుగాళ్లు ఈజీగా మోసం చేసి పెద్ద మొత్తంలో నగదును కొట్టేశారు.

Cyber Fraud: డాక్టర్‌ను ట్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.14 కోట్లు స్వాహా
Cyber Fraud

హైదరాబాద్, నవంబర్ 29: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సైబర్ మోసాలను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్నో రకాలు చర్యలు తీసుకున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు తమ పని తాము చేసుకుపోతూనే ఉన్నారు. ప్రజలను మోసం చేస్తూ భారీగా డబ్బులను కొట్టేస్తున్నారు. తమ మాయ మాటలతో ప్రజల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను ఈజీగా సొంతం చేసుకుంటున్నారు. యాప్‌లను, కొత్త లింక్‌లను ఓపెన్ చేయొద్దని, ఓటీపీలు చెప్పవద్దని పోలీసులు పదే పదే చెబుతున్నారు. అయినా కూడా సైబర్ నేరగాళ్లు రోజుకో రకం మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా తెలంగాణలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ డాక్టర్.. సైబర్ నేరగాళ్ల వలలో పడి పెద్ద మొత్తంలో నగదును పోగుట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే..


హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ను సైబర్ కేటుగాళ్లు ఎంతో ఈజీగా ట్రాప్ చేశారు. పెట్టుబడుల పేరుతో దాదాపు రూ.14 కోట్లను స్వాహా చేశారు. సదరు నేరగాళ్లు డాక్టర్‌ను సోషల్ మీడియా ద్వారా సంప్రదించారు. మోనిక మాధవన్ పేరుతో ఫేస్‌బుక్‌లో డాక్టర్‌కు మెసేజ్ చేశారు. ఆపై నకిలీ ట్రేడింగ్‌ వెబ్‌సైట్‌ లింక్ పంపించారు నేరగాళ్లు. చాలా పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయని డాక్టర్‌ను నమ్మించారు. అయితే డబ్బు విత్‌ డ్రా చేయాలంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. మొదట డాక్టర్ దానిని పట్టించుకోకపోవడంతో ట్యాక్స్ పే చేయాల్సిందే అంటూ అతడిపై సైబర్ నేరగాళ్లు తీవ్ర ఒత్తడి తీసుకొచ్చారు. ఇక డబ్బులు భారీగా వస్తాయంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి.


అలాగే డాక్టర్ కూడా వచ్చే డబ్బు కోసం ఉన్న డబ్బును సైబర్‌ నేరగాళ్లకు దారాదత్తం చేశాడు. తాను ట్యాక్స్ పే చేసినప్పటికీ అవతలి నుంచి ఎలాంటి నగదు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించాడు. వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాక్టర్‌కు వచ్చిన మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది?... ఎవరు పంపారు? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా సైబర్ నేరగాళ్ల వలలో పడి భారీ మొత్తంలో నగదును పోగుట్టుకోవద్దని ప్రజలకు సైబర్ పోలీసులు మరోసారి హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

శబరి యాత్రలో జగన్ జపం... అయ్యప్ప భక్తుల ఆగ్రహం

కర్నూలు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 29 , 2025 | 11:44 AM