DGP Shivadhar Reddy: శాంతి భద్రతలు అదుపులోనే.. వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:53 PM
తెలంగాణలో మహిళా పోలీసుల అధికారులు బాగా పనిచేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) తెలిపారు. మంగళవారం నాడు 2025 వార్షిక నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది పండుగల బందోబస్తు పటిష్టంగా చేశామన్నారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా దిగ్విజయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకున్నామని చెప్పారు. గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతలు కూడా శాంతి భద్రతలు కాపీ ఎలక్షన్స్ అన్ని నిష్పక్షపాతంగా జరిగేలా కాపాడామని డీజీపీ అన్నారు.
మహిళా పోలీసులు భేష్..
తెలంగాణలో 509 మంది నక్సల్స్ లొంగిపోయారని.. వారిలో 481 మంది ఛత్తీస్‌గఢ్, 21 మంది తెలంగాణ, ఒకరు మహారాష్ట్ర, ఒకరు ఏపీ నక్సల్స్ ఉన్నారన్నారు. నాలుగు నేషనల్ లోక్ అదాలత్, 1 స్పెషల్ అదాలత్ నిర్వహించమన్నారు. 7 లక్షల కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించామని చెప్పారు. పోలీస్ శాఖను హైకోర్టు అభినందించిందని వెల్లడించారు. మూడు అంతర్జాతీయ ఈవెంట్స్ సక్సస్ ఫుల్‌గా నిర్వహించుకున్నామని తెలిపారు. తెలంగాణలో మహిళా పోలీసుల అధికారులు బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. సీఐడీ చీఫ్, ఏసీబీ డీజీ చారు సిన్హా , తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్తా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా షికా గోయల్, ఎస్‌ఐబీ ఐజీ సుమతి ఉన్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగిందని, ఫీడ్ బ్యాక్ కోసం ఈ ఏడాది ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మొదటి స్థానంలో తెలంగాణ..
ట్రావెల్ సేఫ్ పేరుతో సీఐడీ నూతన యాప్ తీసుకొచ్చిందని.. మహిళలు, జర్నీ చేసే వారికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని సూచించారు. టూరిస్ట్ పోలీసులను ఈ ఏడాది లాంచ్ చేశామన్నారు. 80 మంది నియమించి.. టూరిస్ట్ ప్లేస్‌లో పోలీసులు ఎలా పని చేయాలనే దానిపై ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. డ్రగ్స్ కట్టడి కోసం ఈ ఏడాది ఈగల్ టీమ్‌ను సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేశారన్నారు. ఈ ఏడాది 1.20 లక్షల సెల్ ఫోన్లు ట్రేస్ చేయడంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు.
సైబర్ నేరాలు తగ్గాయ్..
దేశంలో 41 శాతం సైబర్ నేరాలు పెరిగితే.. తెలంగాణలో 3 శాతం సైబర్ నేరాలు తగ్గాయన్నారు. తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే 2.33% క్రైమ్ రేట్ తగ్గిందని వివరించారు. ఈ ఏడాది 2.28 లక్షలు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో 4 కేసులో మరణ శిక్షలు ఖరారు అయ్యాయని.. 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పండిందని తెలిపారు. ఫోక్సో కేసుల్లో 144 కేసుల్లో 154 మందికి శిక్షలు ఖరారు అయ్యాయని.. అందులో ముగ్గురికి మరణ శిక్ష, 48 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డాయని డీజీపీ పేర్కొన్నారు.
రూ.173 కోట్ల డ్రగ్స్ సీజ్..
తెలంగాణలో డ్రగ్స్ కేసులు భారీగా పెరిగాయని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే 30 శాతం డ్రగ్స్ కేసులు పెరిగినట్లు చెప్పారు. వేరే రాష్ట్రాల్లో ఉన్న నిందితులను ఈగల్ టీమ్ పట్టుకొస్తోందన్నారు. ఈగల్ టీమ్ ఈ ఏడాది రూ.173 కోట్ల డ్రగ్స్ సీజ్ చేసిందని అన్నారు. నమ్మక ద్రోహం కేసులు తెలంగాణలో 23 శాతం పెరిగాయన్నారు. ఐపీసీ సెక్షన్ కింద కేసులు 7.83 % పెరిగాయని.. అలాగే మహిళలపై దాడులు కేసులు 2.90 % పెరిగాయని అన్నారు. 248 మంది మహిళల హత్యలకు గురైయ్యారని తెలిపారు. రేప్ కేసులు 13% తగ్గిందని, కిడ్నాప్‌లు 10% , వేధింపులు కేసులు 9% తగ్గాయని అన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఏడాది 23% రికవరీ చేసిందని... రూ. 246 కోట్లు రికవరీ అయినట్లు తెలిపారు. 25,500 మంది బాధితులకు రూ.159 కోట్లు రీ ఫండ్ చేసినట్లు తెలిపారు.
సీఐడీ విచారణలో నయీమ్ కేసు..
ప్రైవేటు సంస్థల్లో మహిళల కోసం కమిటీలు ఏర్పాటు చేశామని.. పోష్ యాక్ట్‌ను తీసుకొచ్చామన్నారు. తెలంగాణలో ఈ ఏడాది ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయబోతున్నామని.. ఇందులో 18 నుంచి 35 ఏళ్ళు లోపు ఉన్న వారు హాజరువుతారని తెలిపారు. టీజీ ఆర్టీసీ డ్రైవర్లను ఈ ఏడాది పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా పరీక్ష నిర్వహించామన్నారు. నయీమ్ కేసు సీఐడీ విచారణలో ఉందన్నారు. నయీమ్ కేసులో సీజ్ అయిన ల్యాండ్స్, చాలా మంది అమ్మాలని ప్రయత్నం చేశారని తెలిపారు. నయీమ్ లాండ్స్‌పై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ ల్యాండ్ ఎవరూ కొనవద్దని, అమ్మవద్దని ఆదేశాలు ఉన్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. భార్య మృతి
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన మహిళ.. ఎంత డబ్బు పోగొట్టుకున్నారంటే..
Read Latest Telangana News And Telugu News