Share News

ABN Effect: హాస్టల్ వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:28 PM

భూపాలపల్లిలోని ఎస్సీ హాస్టల్ వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి.. హాస్టల్ వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.

ABN Effect: హాస్టల్ వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు

భూపాలపల్లి, డిసెంబర్ 30: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్‌పై వేటు పడింది. హాస్టల్‌లోకి ఆగంతకులు ప్రవేశించిన ఘటనపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రసారమైయ్యాయి. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఆ హాస్టల్ వార్డిన్ భవానీపై సస్పెన్షన్ వేటు వేసింది. జిల్లాలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్ది రోజులుగా హాస్టల్‌కు వరుసగా ఆగంతకులు వస్తున్నారు. గంట, గంటన్నర హాస్టల్‌లో ఉండి వారు వెళ్లి పోతున్నారు. దీంతో హాస్టల్‌లోని విద్యార్థులు 100 నెంబర్‌కు ఫోన్ చేసి వాస్తవ పరిస్థితిని వివరించారు. అనంతరం హాస్టల్‌కు పోలీసులు వచ్చారు.


కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఎవరు దీనిపై స్పందించలేదు. అయితే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంపై హాస్టల్ వార్డెన్ భవానీ.. విద్యార్థినులపై మండిపడ్డింది. దీంతో వారిపై విచక్షణ రహితంగా దాడి చేసింది. అందుకు సంబంధించిన చిత్రాలను సైతం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించింది.


హాస్టల్ వార్డెన్ భవానీని సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. మీడియాలో కథనాలు రావడంతో.. జిల్లా అధికారులు సైతం స్పందించారు. ఈ ఘటనపై వారు ఆరా తీశారు. మరికాసేపట్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సైతం ఈ ఎస్సీ హాస్టల్‌ను పరిశీలించనున్నారు. జరిగిన సంఘటనపై విద్యార్థులతో ఆయన మాట్లాడి.. వారికి భరోసా కల్పించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉంది: అనిల్ రావిపూడి

వైకుంఠ ఏకాదశి.. ఆ రోజు ఇలా చేస్తే..

For More TG News And Telugu News

Updated Date - Dec 30 , 2025 | 12:34 PM