Share News

Director Anil Ravipudi: దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉంది: అనిల్ రావిపూడి

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:41 AM

సంక్రాంతి పండగకి మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సినిమా ఇప్పటికే పూర్తయిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఆయన వివరించారు.

Director Anil Ravipudi: దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉంది: అనిల్ రావిపూడి
Tollywood Director Anil Ravipudi

విజయవాడ, డిసెంబర్ 30: దుర్గమ్మ వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. మంగళవారం ఉదయం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువదీరిన దుర్గమ్మ వారిని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మ వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ప్రసాదంతోపాటు చిత్ర పటాన్ని ఆయనకు ఆలయ అధికారులు అందజేశారు. ఆ తర్వాత వేద పండితులు ఆయన్ని ఆశీర్వదించారు.


ఆలయం బయట అనిల్ రావిపూడి విలేకర్లతో మాట్లాడుతూ.. సంక్రాంతి పండగకి మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. ఈ సినిమా ఇప్పటికే పూర్తయిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని వివరించారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ పాడిన పాట.. ఈ చిత్రానికే హైలెట్‌గా నిలుస్తోందని పేర్కొన్నారు.


మంగళవారం సాయంత్రం తాను గుంటూరులో చదివిన కాలేజీలో ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నామని వివరించారు. ఈ చిత్రం బాగా వచ్చిందన్నారు. ప్రజలు ఈ చిత్రాన్ని ఆశీర్వాదిస్తారని ఆశిస్తున్నట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

వైకుంఠ ఏకాదశి.. ఆ రోజు ఇలా చేస్తే..

For More AP News And Telugu News

Updated Date - Dec 30 , 2025 | 11:48 AM