CM Revanthe Reddy: నియోపోలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ప్రారంభించిన సీఎం
ABN , Publish Date - Sep 08 , 2025 | 05:44 PM
కోకాపేట వద్ద నియో పోలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్‌ను సోమవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ట్రంపెట్ జంక్షన్‌తో మోకిల, శంకర్‌పల్లి ప్రాంతాలకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి.
రంగారెడ్డి, సెప్టెంబర్ 08: కోకాపేట వద్ద నియో పోలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్‌ను సోమవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హెచ్ఎండీఏ నిర్మించిన నియోపోలిస్, కోకాపేట్ ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ చేస్తూ ట్రంపెట్‌ను నిర్మించారు. నియో పోలిస్ ప్రాంతంలో భారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. దీంతో నియోపోలిస్, కోకాపేట ప్రాంతంలో భారీగా ఐటీ కంపెనీలు తరలి రానున్నాయి. ఫ్యూచర్ ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ ట్రంపెట్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ట్రంపెట్ జంక్షన్‌తో మోకిల, శంకర్‌పల్లి ప్రాంతాలకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి.
నియో పోలిస్ నుంచి ట్రంపెట్ ద్వారా 20 నిమిషాల్లో ఎయిర్ పోర్ట్ చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అలాగే నియోపోలిస్ నుంచి పైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలికి ఈజీగా కనెక్టివిటీ ఉంటుందని పేర్కొంటున్నారు. ఓఆర్ఆర్‌కు కనెక్ట్ చేసేందుకు నియోపోలిస్ వద్ద ట్రంపెట్‌కి రెండు చోట్ల టోల్ గేట్స్ ఏర్పాటు చేశారు. ఈ నియో పోలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వాస్తవాలు చెబితే.. తప్పు పట్టిన బీఆర్ఎస్
ఐఏఎస్‌లు బదిలీ.. టీటీడీ ఈఓగా మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్
For More TG News And Telugu News