CM Revanth Reddy: ఆ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:01 PM
CM Revanth Reddy: జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలకనిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ పైన పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్: జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(శనివారం) తెలంగాణ సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటి పారుదల శాఖ) ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ పైన పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఐఐటీ హైదరాబాద్ టీంతో కో ఆర్డినేషన్ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.
పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2022లో 27 లక్షల క్యూసెక్‌ల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సీఎం రేవంత్‌రెడ్డికి అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ పైన ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని అధికారులు వివరించారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని సీఎం రేవంత్‌రెడ్డికి అధికారులు తెలియజేశారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను తెలపాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
TG News: కేక్ తింటున్నారా.. జాగ్రత్తండోయ్
Hyderabad: కొంతమంది తెలుగు భాషను చిన్నచూపు చూస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
HYDRA: హైడ్రా మరో కీలక నిర్ణయం..
Read Latest Telangana News And Telugu News