CM Revanth Reddy: వైరల్‌గా మారిన సదర్ ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి తలపాగా లుక్స్
ABN , Publish Date - Oct 19 , 2025 | 08:02 PM
హైదరాబాద్‌లో నిర్వహించిన సదర్ ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన ప్రజలకు అభివాదం చేసి, ఆప్యాయంగా చేతులు కలిపారు. ఈ సందర్భంగా తలపాగా ధరించిన సీఎం రేవంత్ రెడ్డి లుక్స్ ఆసక్తికరంగా మారాయి.
హైదరాబాద్, అక్టోబర్ 19: హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన అక్కడికి వచ్చిన ప్రజలకు అభివాదం చేసి, ఆప్యాయంగా చేతులు కలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. యాదవ సోదరులతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో యాదవ సోదరుల భాగస్వామ్యం ఉందన్నారు. అధికారంలో, సంక్షేమంలో వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వం వచ్చాకనే సదర్ ఉత్సవానికి నిధులు ఇచ్చి అధికారికంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. ఇలా ఉండగా, సీఎం రేవంత్ ప్రజలతో మమేకమైన విధానం, తలపాగా ధరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో అందర్నీ విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..
దీపాలు, కొవ్వొత్తులకు ఖర్చు దండుగ.. అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
దీపావళి వేళ.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి