Revanth Reddy In Tamil Nadu: తెలంగాణలో మరో కొత్త పథకం.. ఎప్పటి నుంచి అంటే....
ABN , Publish Date - Sep 25 , 2025 | 10:11 PM
విద్యలో ముందంజ కార్యక్రమం తమిళనాడు యువతకు ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తమిళనాడు అవలంబిస్తున్న సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం హృదయాన్ని తాకుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
చెన్నై: అన్నాదొరై, కరుణానిధి, కామరాజ్ వంటి గొప్ప యోధుల జన్మస్థలం తమిళనాడు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కరుణానిధి విజన్‌ను అమలు చేస్తున్న సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధిలను అభినందిస్తున్నట్లు చెప్పారు. చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన విద్యలో ముందంజ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంత మంచి కార్యక్రమానికి తనని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరాగాంధీ కామరాజ్ ప్లాన్‌ను తీసుకువచ్చారుని గుర్తు చేశారు. కామరాజ్ తమిళనాడులో తీసుకువచ్చిన విద్యా విధానాన్ని దేశం అనుసరిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
విద్యలో ముందంజ కార్యక్రమం తమిళనాడు యువతకు ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తమిళనాడు అవలంబిస్తున్న సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం హృదయాన్ని తాకుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలోను ఈ స్కీమ్‌ను వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. నాన్ ముదలవన్ (స్కిల్ డవెలప్‌మెంట్) కింద రూ.10 వేల ఉపకార వేతనం ప్రభుత్వ కళాశాలలకు వెళ్లే బాలురు, బాలికలకు ఇచ్చే స్కీమ్‌లు ఉండడం అదృష్టమని చెప్పుకొచ్చారు.
తమిళనాడు పేదలకు అండగా మంచి సీఎం స్టాలిన్ ఉన్నారని చెప్పారు. ఎన్నో శతాబ్దాల నుంచి తమిళ, తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సాంస్కృతిక, చారిత్రకపరమైన బలమైన సంబంధం ఉందని వివరించారు. 1991 సరళీకరణ తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలతో తమిళనాడులో మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాలు అభివృద్ధి చెందాయని సీఎం రేవంత్ వెల్లడించారు.
Also Read:
ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్
వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..