Share News

Telangana Rising Global Summit 2025: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం

ABN , Publish Date - Dec 09 , 2025 | 05:39 PM

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశమయ్యారు. మంగళవారం ఫ్యూచర్ సిటీలోని సీఎంతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారితో సీఎం చర్చించారు.

Telangana Rising Global Summit 2025: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం

హైదరాబాద్, డిసెంబర్ 09: స్క్రిప్ట్‌తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని టాలీవుడ్ ప్రముఖలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా వారికి సీఎం వివరించారు.


24 క్రాఫ్ట్స్‌లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని వారికి సీఎం రేవంత్ సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా వారికి సీఎం రేవంత్ వివరించారు. సీఎం రేవంత్‌తో సమావేశమైన వారిలో చిరంజీవి, అజయ్ దేవగన్ అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా, అక్కినేని అమలతోపాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సోమవారం ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నేటితో అంటే.. మంగళవారంతో ముగియనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

రెవెన్యూ సేవలు మరింత సులభతరం: సీఎం చంద్రబాబు

ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా

Read Latest TG News And Telugu News

Updated Date - Dec 09 , 2025 | 07:13 PM