Share News

MLA Kale Yadayya: చేవెళ్ల ప్రమాదం.. ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ

ABN , Publish Date - Nov 03 , 2025 | 09:59 AM

బస్సు ప్రమాదం జరిగిన చాలా సమయం తరువాత ఎమ్మెల్యే కాలె యాదయ్య ఘటనా స్థలానికి చేరుకోవడంతో.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Kale Yadayya: చేవెళ్ల ప్రమాదం.. ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ
MLA Kale Yadayya

హైదరాబాద్: చేవెళ్ల మండలంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది. బస్సు ప్రమాదం జరిగిన చాలా సమయం తరువాత ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకోవడంతో.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పనులు ఎందుకు చేపట్టడం లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. అనేకసార్లు రోడ్డు విస్తరణ చేయాలని చెప్పినా నిరక్ష్యం చేశారని స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. స్థానికులు నిరసన తెలపడంతో ఘటన స్థలం నుంచి ఎమ్మెల్యే కాలె యాదయ్య వెళ్లిపోయారు.


ఈ రోడ్డు ప్రమాదం హృదయాలను కలిచివేస్తుంది. బస్సు, టిప్పర్ వేగంగా ఒకదానికొకటి ఢీ కొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లు సహా 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఘటన సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలు చేయడం గుండెను పిండేసేవిగా ఉన్నాయి. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

Two IAS Coaching Institutes: మరో రెండు ఐఏఎస్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్లపై సీసీపీఏ కొరడా.. రూ.8లక్షల చొప్పున ఫైన్‌

Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు

Updated Date - Nov 03 , 2025 | 11:45 AM