Share News

Minister Ponnam: రవీంద్రభారతిలో శివశంకర్ జయంతి ఉత్సవాలు.. హాజరైన ముఖ్యనేతలు

ABN , Publish Date - Aug 10 , 2025 | 09:00 PM

రాజ్యాంగ పరిరక్షణ, న్యాయం, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం పనిచేసిన ప్రజాసేవకుడిగా.. శివశంకర్‌కు గొప్ప పేరుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తాను విద్యార్థిగా రాజకీయల్లో ఉన్నపుడు శివశంకర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు.

Minister Ponnam: రవీంద్రభారతిలో శివశంకర్ జయంతి ఉత్సవాలు.. హాజరైన ముఖ్యనేతలు
Minister Ponnam Prabhakar

హైదరాబాద్: నేడు దివంగత నేత పుంజల శివశంకర్ 96వ జన్మ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో ఆయన జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.


రాజ్యాంగ పరిరక్షణ, న్యాయం, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం పనిచేసిన ప్రజాసేవకుడిగా.. శివశంకర్‌కు గొప్ప పేరుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తాను విద్యార్థిగా రాజకీయల్లో ఉన్నపుడు శివశంకర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని చెప్పకొచ్చారు. రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా.. చిన్నస్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎంతో పేరుని సంపాదించారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్ని కూడా ఆయన ప్రభావితం చేశారని తెలిపారు. చిన్న వయసులోనే ఎంతో ఘనతను, పేరు ప్రతిష్టను సాధించారని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. పిల్లలకి శివశంకర్ జీవిత చరిత్ర పాఠంగా చెప్పాలని మంత్రి పొన్నం సూచించారు.


తెలంగాణ నుంచి భారత దేశం స్థాయికి ఎదిగిన బలమైన నేత శివశంకర్ అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీర్తించారు. శివశంకర్ పనితనాన్ని, ప్రజలకు చేసే సేవని అప్పట్లోనే ఇందిరాగాంధీ గుర్తించారని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందంటే శివశంకర్ లాంటి వ్యక్తుల స్ఫూర్తి అని పేర్కొన్నారు. బీసీలకు అధికారం వచ్చినప్పుడే రాజ్యాంగానికి అధికారం వస్తుందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయo కోసం పోరాడిన శివశంకర్ గురించి తెలంగాణ ప్రజలకే కాదు.. తెలుగు ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అద్దంకి దయాకర్ ఉద్ఘాటించారు.

Updated Date - Aug 10 , 2025 | 09:00 PM