Ktr Vs Mallu: డిప్యూటీ సీఎం భట్టికి కేటీఆర్ సవాల్
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:49 PM
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఇంకా అన్ని హామీలు అమలు చేయలేదని విమర్శించారు.
హైదరాబాద్, ఆగస్ట్ 13: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం తన ఎక్స్ ఖాతా వేదికగా విమర్శలు గుప్పించారు. అందులోభాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆరుగ గ్యారెంటీల వాగ్దానం గుర్తుందా ? అని ప్రశ్నించారు. 100 రోజులు కాదు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయినా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదంటూ మండిపడ్డారు.
ఇచ్చిన హామీలు అమలు చేశామని తెలంగాణలోని ఏ గ్రామానికైనా వెళ్లి చెప్పగలరా? అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కేటీఆర్ తన ఎక్స్ ఖాతా వేదికగా సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికే అబద్దాలు చెప్పిన మీ నాయకులను ప్రజలు వెంబడిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు క్యాబినెట్ మంత్రులంతా తెలంగాణలో ఎక్కడికైనా వెళ్లి.. తమ ప్రభుత్వం ఆరు హామీలు నెరవేర్చామని చెప్పాలని ఆయన సూచించారు. మీ అబద్ధాలు, తప్పుడు ప్రచారాలపై ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టక పోతే.. నేను రాజకీయాలను విడిచి పెడతానంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..
రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
Read latest Telangana News And Telugu News