Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌పై ఫోకస్
ABN , Publish Date - Sep 19 , 2025 | 10:36 AM
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి బలం ఉందనే విషయం అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైంది. ఆ క్రమంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని ఆ పార్టీ కృతనిశ్చయంతో ఉంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 19: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని వరుసగా మరోసారి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకోసం ఆ పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. నియోజకవర్గంలోని డివిజన్ స్థాయి నేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఉదయం 11. 00 గంటలకు తెలంగాణ భవన్‌లో ఎర్రగడ్డ డివిజన్‌లోని స్థాయి బూత్ కమిటీలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై వారికి కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే వెంగళరావు నగర్, రహమత్ నగర్‌లలోని పార్టీ కేడర్‌తో కేటీఆర్ సమావేశమైన విషయం విదితమే. అలాగే సదరు నియోజకవర్గంలోని డివిజన్లకు ఇన్‌ఛార్జ్‌లను ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నియమించిన సంగతి తెలిసిందే.
అదీకాక అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ తన సత్తా చాటిన సంగతి తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది. అందుకోసం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాకుండా.. ఈ ఉప ఎన్నిక ఫలితం ప్రభావం త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
మరోవైపు అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే ఆ యా పార్టీల అధినేతలు ఒక నిర్ణయానికి వచ్చారని.. త్వరలో ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపినాథ్ భార్య సునీతను బరిలో దింపాలని ఇప్పటికే నిర్ణయించినట్లు ఒక చర్చ జరుగుతుంది. ఇక అధికార కాంగ్రెస్ మాత్రం.. అభ్యర్థిని పార్టీ అధిష్టానం ఎంపిక చేస్తుందంటూ ఇటీవల సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం విదితమే.
2023లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ ఘన విజయం సాధించారు. గతంలో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పలు మార్లు గెలుపొందారు. అయితే అనారోగ్య కారణంగా ఆయన ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహాలయ అమావాస్య.. పుర్వీకుల అనుగ్రహం కోసం..
విజయవాడకు ఎంపీ మిథున్‌రెడ్డి..
For More TG News And Telugu News