Dasoju Sravan: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం
ABN , Publish Date - Aug 13 , 2025 | 06:23 PM
తెలంగాణలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ నియామకాలను సుప్రీంకోర్టు నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పందించారు.
హైదరాబాద్, ఆగస్ట్ 13: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ నియామకాలను సుప్రీంకోర్టు నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పందించారు. బుధవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఈ అంశంపై తాను రెండేళ్ల పాటు పోరాటం చేశానన్నారు. ఇది వ్యక్తులపై పోరాటం కాదని.. రాజ్యాంగ బద్ధ హక్కుల కోసం చేసిన పోరాటమని ఆయన అభివర్ణించారు.
రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వాలు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరికి తగినట్లు వారు రాజ్యాంగాన్ని అనువదించుకొని అమలు చేయడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసు విషయంలో సెప్టెంబర్ 17వ తేదీన మరోసారి విచారణ జరగనుందని గుర్తు చేశారు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక గతంలో తన అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ధర్మం గెలిచినట్లుగా తాను భావిస్తున్నానని తెలిపారు. గతంలో హైకోర్టు తమ నియామక నిర్ణయాన్ని సైతం తప్పుబడుతూ తీర్పు ఇచ్చిందని తెలిపారు.
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పాత ఆర్డర్‌ను తీసుకు వచ్చి.. ఈ ఇద్దరితో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారని వివరించారు. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ పూర్తిగా వచ్చిన తర్వాత మిగతా వివరాలు తెలుస్తాయన్నారు. సెప్టెంబర్ 17వ తేదీన సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలని తెలిపారు. భవిష్యత్తులో ఏ గవర్నర్ కూడా ఇలాంటి తప్పిదాలు చేయకుండా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వబోతుందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. 2024 ఆగస్టు 14న సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు చేసిందని గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు హైడ్రా కమిషనర్ కీలక సూచన
వదంతులు నమ్మకండి.. అప్రమత్తమైన ప్రభుత్వం
Read latest Telangana News And Telugu News